ఒంగోలుకు వైఎస్‌ విజయలక్ష్మి.. భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2022-09-26T01:28:20+05:30 IST

వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తల్లి విజయలక్ష్మి ఆదివారం ఒంగోలు వచ్చారు.

ఒంగోలుకు వైఎస్‌ విజయలక్ష్మి.. భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు

ఒంగోలు: వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తల్లి విజయలక్ష్మి ఆదివారం ఒంగోలు వచ్చారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లి ఆయన తల్లి పిచ్చమ్మను పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న పిచ్చమ్మ ఆరోగ్య పరిస్థితిని సుబ్బారెడ్డి సోదరుడు భద్రారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. విజయలక్ష్మిని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీసమేతంగా కలిసి మొక్కను అందజేశారు. విజయలక్ష్మి ఒంగోలు వచ్చినట్లు తెలియడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా వైవీ నివాసం వద్దకు చేరుకున్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు, నగర మేయర్‌ గంగాడ సుజాత తదితరులు విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి జ్ఞాపికను అందజేశారు. 

Read more