శివుడు పిలుస్తున్నాడంటూ నోట్ రాసి..

ABN , First Publish Date - 2022-09-26T17:48:10+05:30 IST

శివుడు (Lord Shiva) పిలుస్తున్నాడంటూ ఓ యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

శివుడు పిలుస్తున్నాడంటూ నోట్ రాసి..

Prakasam : శివుడు (Lord Shiva) పిలుస్తున్నాడంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్దారవీడు మండలం చాట్లమడలో యువకుడి ఆత్మహత్య సంచలనం రేపింది. చాట్లమడ గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి.. చెన్నై (Chennai)లో బీటెక్ 3వ సంవత్సరం (Btech 3rd year) చదువుతున్నాడు. కాలేజీకి సెలవులు ఇవ్వడంతో ఇటీవలే చాట్లమడకు తిరిగి వచ్చాడు. అయితే తాజాగా అతను తనను శివుడు పిలుస్తున్నాడంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని,  ప్రేమ వంటి వ్యవహారాలు (Love Affairs) లేవని సూసైడ్ నోట్‌లో శేఖర్ రెడ్డి పేర్కొన్నాడు. తాను పిరికివాడిని కాదని, ఈ పాడు సమాజంలో ఉండవద్దని శివుడు చెప్పాడని సూసైడ్ నోట్‌లో శేఖర్ రెడ్డి రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


Read more