-
-
Home » Andhra Pradesh » YCP representatives are speaking unethically mvs-MRGS-AndhraPradesh
-
AP News: వైసీపీ ప్రజాప్రతినిథులు అనైతికంగా మాట్లాడుతున్నారు : నాదెండ్ల మనోహర్
ABN , First Publish Date - 2022-09-14T03:02:09+05:30 IST
కృష్ణాజిల్లా: ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)పై జనసేన పార్టీ (Janasena Party) పీఎసీఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ (YSRCP) ప్రజాప్రతినిధులు అనైతికంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా రోడ్లలో ఎటువంటి మా

కృష్ణాజిల్లా: ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)పై జనసేన పార్టీ (Janasena Party) పీఎసీఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ (YSRCP) ప్రజాప్రతినిధులు అనైతికంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా రోడ్లలో ఎటువంటి మార్పు లేదు. వైసీపీ ప్రజాప్రతినిధులు విలువలు కోల్పోయి, అనైతిక భాష మాట్లాడుతున్నారు. మహాత్మా గాంధీ తిరిగిన గుడివాడను, బూతుల వాడగా మార్చారు. ఎమ్మెల్యే కొడాలి నాని బూతులు మాట్లాడడం తప్ప, ప్రజల కనీస మౌలిక వసతులు కూడా తీర్చలేకపోతున్నాడు. రాజకీయ దాడుల కోసం వెచ్చించే సమయాన్ని, ప్రజల బాగోగుల కోసం వినియోగించాలి. సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 3వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం.ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. మూడు లక్షల అరవై మంది జనసేన సభ్యత్వం కలిగిన కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.