అల్లర్లతో పాదయాత్రను అడ్డుకుంటే.. రాష్ట్రపతి పాలన ఖాయం

ABN , First Publish Date - 2022-10-04T07:47:06+05:30 IST

న్యాయస్థానం అనుమతితో అమరావతి రైతులు శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అల్లర్లు సృష్టించి అడ్డుకోవాలని చూస్తే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని, కనుక అలాంటి పిచ్చి పనులు మానుకోవాలని

అల్లర్లతో పాదయాత్రను అడ్డుకుంటే.. రాష్ట్రపతి పాలన ఖాయం

జగన్‌ డైరెక్షన్‌లోనే మంత్రుల మాటలు: రఘురామ 


న్యూఢిల్లీ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి) : న్యాయస్థానం అనుమతితో అమరావతి రైతులు శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అల్లర్లు సృష్టించి అడ్డుకోవాలని చూస్తే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని, కనుక అలాంటి పిచ్చి పనులు మానుకోవాలని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. పాదయాత్రను న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి భవన్‌ ఎప్పటికప్పుడూ గమనిస్తూనే ఉన్నాయని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణాజిల్లా గుడివాడ, పశ్చిమగోదావరి జిల్లాలో రైతుల పాదయాత్రకు ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నించారని, అయినా విజయంవతమైందని పేర్కొన్నారు. మంత్రివర్గం ఆమోదించిన రాజధానిని హైకోర్టు తిరస్కరించిన తర్వాత, మళ్లీ సుప్రీంకోర్టులో స్టే కూడా రాలేదని, కేసు అసలు లిస్టే కాలేదని, అలాంటప్పుడు దానిపై మంత్రులు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఇక వికేంద్రీకరణ గురించి జగన్‌ పత్రికలో ఎన్ని వార్తలు రాసుకున్నా, ఎంపీలతో మాట్లాడించినా.. అవి మీరు మాట్లాడించినవే అని ప్రజలందరికీ తెలుసునని సీఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు. 

Read more