ఎయిర్ పోర్టులో ఎంపీ భరత్ సెల్‌ఫోన్ మిస్సింగ్... పోలీసులు ఏం చేశారంటే..!

ABN , First Publish Date - 2022-07-06T03:20:59+05:30 IST

ఎయిర్‌పోర్టులో ఎంపీ భరత్ సెల్‌ఫోన్ మిస్సింగ్ అయింది. సెల్‌ఫోన్ మిస్సింగ్ సమయంలో ఎంపీ భరత్‌ను గాడాలకు చెందిన పారిశ్రామికవేత్త ...

ఎయిర్ పోర్టులో ఎంపీ భరత్ సెల్‌ఫోన్ మిస్సింగ్... పోలీసులు ఏం చేశారంటే..!

రాజమండ్రి: నగర ఎయిర్‌పోర్టులో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ (Mp Bharat) సెల్‌ఫోన్ మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపింది. సెల్‌ఫోన్ (Cell Phone) మిస్ అయిన సమయంలో ఎంపీ భరత్‌ను గాడాలకు చెందిన పారిశ్రామికవేత్త శిరీష (Sirisha) కలిశారు. ఫోన్ మిస్సింగ్ గురించి శిరీషపై భరత్ అనుమానం వ్యక్తం చేయడంతో గాడాలలోని ఆమె ఇంటికెళ్లిన కోరుకొండ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. బెడ్ రూమ్‌లోని సామాన్లు కిందపడేసి చిందరవందర చేశారు. పోలీసుల తీరుపై సీఎంవోకి శిరీష ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో వేధించి, ఇంట్లో అమర్యాదగా వ్యవహరించారంటూ కోరుకొండ పోలీసులపై శిరీష ఆరోపణలు చేశారు. 
Read more