గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన Perni nani

ABN , First Publish Date - 2022-07-06T16:32:05+05:30 IST

కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేట గ్రామంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని బుధవారం ఉదయం పరామర్శించారు.

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన Perni nani

విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేట గ్రామంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని (Perni nani) బుధవారం ఉదయం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారన్నారు. నిన్న రెండు చాప్టర్లతో ప్రత్యేక బృందాలు గాలించాయని తెలిపారు. ఈరోజు హెలికాప్టర్‌లు, భారీ పడవల సాయంతో వెతుకులాట ప్రారంభమైందన్నారు. కాకినాడ చుట్టుపక్కల అన్ని వైపులా ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు చేపట్టారని... మత్స్యకారులు క్షేమంగా ఇంటికి వస్తారని తాము భావిస్తున్నామని పేర్నినాని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు... సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన నలుగురు మత్స్యకారుల ఆచూకీ మూడు రోజులైనా ఇంకా లభించలేదు. దీంతో మత్య్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బందరు మండలం క్యాంబెల్ పేట నుంచి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. కాకినాడ సమీపంలో బోటు మోటారు పని చేయడం లేదని యజమానికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఫోన్లు పని చేయడం లేదు. మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బంది మత్స్యకారుల ఆచూకీ కోసం సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.  

Read more