Kodali nani: అస్తమించిన వ్యవస్థ టీడీపీ

ABN , First Publish Date - 2022-10-11T18:15:03+05:30 IST

టీడీపీ నేతలపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kodali nani: అస్తమించిన వ్యవస్థ టీడీపీ

విజయవాడ: టీడీపీ నేతల (TDP Leaders)పై మాజీ మంత్రి కొడాలి నాని (Kodali nani) ఆగ్రహం వ్యక్తం  చేశారు. మంగళవారం గుడివాడ 33వ వార్డులో గడపగడప మన ప్రభుత్వం రెండవ రోజు కార్యక్రమంలో కొడాలి నాని (YCP MLA) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అస్తమించిన వ్యవస్థ టీడీపీ (TDP) అని... ఆ పార్టీ డిఫాల్డర్లు నోటికొచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. లోకేష్‌ (Nara lokesh)కు పార్టీ అప్పచెప్పడానికి పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌ (Junior NTR)ను తిట్టిస్తున్నారన్నారు. అమరావతిలో టీడీపీ వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ మాఫియా, విశాఖలో కూడా జరుగుతునట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 29 గ్రామాల అమరావతి ఎక్కడ, 25 లక్షల జనాభా గల విశాఖ ఎక్కడ అని అన్నారు. విశాఖ నగరంపై టీడీపీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విషం కక్కుతున్నారని ఆయన దుయ్యబట్టారు.


30 లక్షలు ఉన్న అమరావతి భూములు రూ.10 కోట్లకు పెరిగాయన్నారు. రాజధాని నిర్ణయం తర్వాత గజాలు లెక్కన విక్రయాలు జరిగే విశాఖ భూముల ధరల్లో ఏం మార్పు వచ్చిందని ప్రశ్నించారు. విశాఖ దసపల్లా భూముల్లో టిడిపి ఆఫీసు, చంద్రబాబు అనుయాయుల కార్యాలయాలు ఉన్నాయన్నారు. విజయసాయి రెడ్డి (Vijayasai reddy) ఎలా కబ్జా చేస్తారని నిలదీశారు. ప్రభుత్వ ఆస్తి అయిన రిషికొండలో ప్రభుత్వ కార్యాలయాలు కడుతుంటే దోపిడీ ఎలా అవుతుందని అన్నారు. ఒక అబద్ధాన్ని చంద్రబాబు (Chandrababu naidu), పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 


Updated Date - 2022-10-11T18:15:03+05:30 IST