వైసీపీ నేతల అధికార మదం పరాకాష్టకి చేరింది: లోకేష్‌

ABN , First Publish Date - 2022-03-05T03:15:51+05:30 IST

వైసీపీ నేతల అధికార మదం పరాకాష్టకి చేరిందని టీడీపీ నేత లోకేష్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయంగా

వైసీపీ నేతల అధికార మదం పరాకాష్టకి చేరింది: లోకేష్‌

అమరావతి: వైసీపీ నేతల అధికార మదం పరాకాష్టకి చేరిందని టీడీపీ నేత లోకేష్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయంగా మంత్రులే పోలీసులపై దుర్భాషలాడుతూ.. దాడికి పాల్పడడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. పోలీసుల పట్ల మంత్రులు పేర్నినాని, అప్పలరాజు వైఖరి సరికాదన్నారు. పోలీసులపై వైసీపీ నేతల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులకే ఈ దుస్థితి ఉంటే.. రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలని లోకేష్‌ పిలుపునిచ్చారు.

Read more