వినాయక నిమజ్జనం సందర్భంగా వైసీపీ నేతల బంపర్ ఆఫర్

ABN , First Publish Date - 2022-09-06T15:32:53+05:30 IST

వినాయక నిమజ్జనం సందర్భంగా వైసీపీ నేతలు(YCP Leaders) బంపర్ ఆఫర్(Bumper Offer) ప్రకటించారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా వైసీపీ నేతల బంపర్ ఆఫర్

గుంటూరు : వినాయక నిమజ్జనం(Ganesh immersion) సందర్భంగా వైసీపీ నేతలు(YCP Leaders) బంపర్ ఆఫర్(Bumper Offer) ప్రకటించారు. నిమజ్జనం అంటే ఏవో రకరకాల ప్రసాదాలు పెడతారు లేదంటే అన్నదానాలు చేస్తారు. కానీ వైసీపీ నేతల రూటే సెపరేట్. విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారు. అది కూడా ట్రాక్టర్లలో తీసుకొచ్చి మరీ. ఇది ఎక్కడో జరిగిందనుకుంటే.. తప్పులో కాలేసినట్టే. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Mohan Reddy) నివాసానికి కేవలం కూత వేటు దూరంలోనే జరిగింది.


తాడేపల్లి గేటు సెంటర్(Tadepalli gate centre) దగ్గర విచ్చలవిడిగా మద్యం పంపిణీ జరిగింది. ట్రాక్టర్‌పై డ్రమ్ము పెట్టి మరీ వైసీపీ నేతలు మద్యం పంపిణీ(Wine distribution) చేయడం గమనార్హం. పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతలు మద్యం పంపిణీ చేశారు. సీఎం జగన్‌రెడ్డి(CM Jagan Mohan Reddy) నివాసానికి కూతవేటు దూరంలోనే పంపిణీ జరిగింది. వైసీపీ నేత వేణుగోపాలరెడ్డి(YCP Leader Venu Gopal Reddy) తీరుపై మహిళలు మండిపడుతున్నారు. 

Read more