వైసీపీ ‘అసమ్మతి’ నేత ఇంటిపై దాడి

ABN , First Publish Date - 2022-06-11T07:12:47+05:30 IST

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ నాయకుడు బైసాని రాంప్రసాద్‌ ఇంటిపై దాడి జరిగింది. ఆయన ఇంటి కిటికీ అద్దాలను బద్దలు కొట్టారు. ఇది ఎమ్మెల్సీ..

వైసీపీ ‘అసమ్మతి’ నేత ఇంటిపై దాడి

కిటికీ అద్దాలు ధ్వంసం.. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అనుచరులపై అనుమానం 


హిందూపురం టౌన్‌, జూన్‌ 10: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ నాయకుడు బైసాని రాంప్రసాద్‌ ఇంటిపై దాడి జరిగింది. ఆయన ఇంటి కిటికీ అద్దాలను బద్దలు కొట్టారు. ఇది ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అనుచరుల పనే అని రాంప్రసాద్‌ ఆరోపించారు. బైసాని రాంప్రసాద్‌ కుటుంబ సభ్యులతోపాటు బుధవారం బెంగళూరుకు వెళ్లారు. గురువారం తిరిగి వచ్చేసరికి  బెడ్‌రూమ్‌ కిటికీలకు ఉన్న అద్దాలు ధ్వంసమై కనిపించాయి. ‘‘ఇటీవల వైసీపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అసమ్మతి వర్గంతో కలిసి విజయవాడకు వెళ్లాను. నేను  కరస్పాండెంట్‌గా ఉన్న ఓ విద్యాసంస్థపై ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వద్ద ఉన్న ఓ వ్యక్తి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మా విద్యా సంస్థకు ఆయన చెడ్డపేరు తెస్తున్నారని పార్టీ పెద్దలకు చెప్పాను. దీంతో... ఎమ్మెల్సీ వద్ద ఉన్న కొందరు నన్ను టార్గెట్‌ చేశారు. దాడి చేయడానికి వచ్చి...నేను లేకపోవడంతో అద్దాలు పగలకొట్టి వెళ్లిపోయారు’’ అని రాంప్రసాద్‌ మీడియాకు తెలిపారు. కొంతమంది నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. తనకు న్యాయం చేయాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరతానన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more