Tdp Anna Canteens: అన్న క్యాంటీన్లు వైసీపీలో దడ పుట్టిస్తున్నాయా?

ABN , First Publish Date - 2022-09-04T01:27:01+05:30 IST

తెనాలి మార్కెట్ సెంటర్‌లోని అన్నాక్యాంటీన్‌ లో నిర్వాహకులు ఆహార పంపిణీ చేపట్టారు...

Tdp Anna Canteens: అన్న క్యాంటీన్లు వైసీపీలో దడ పుట్టిస్తున్నాయా?

గుంటూరు: తెనాలి మార్కెట్ సెంటర్‌లోని అన్నాక్యాంటీన్‌ (Anna canteen)లో నిర్వాహకులు ఆహార పంపిణీ చేపట్టారు. కాగా...  ట్రాఫిక్ సమస్య వస్తుందని మున్సిపల్ అధికారుల అభ్యంతరం తెలిపారు.  ఈ క్రమంలో ఆహార పదార్థాలు ఉన్న ఆటోను అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లారు. దీంతో పేదవాడి ఆకలి తీర్చే ప్రక్రియను అడ్డుకోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అమరోవైపు తెనాలి మున్సిపల్ ఆఫీస్ ముందు వైసీపీ (YCP) వారితో పోలీసులు అన్నదానం పెట్టించారు. పురవేదిక వద్ద పేదలకు  టీడీపీ నేతలు (TDP Leaders) అన్నం పెడుతున్నారు. దీంతో వైసీపీ అన్నదానం వైపు పేదలు ఆసక్తి చూపని పరిస్థితి. టీడీపీ అన్నం దానం వద్ద భోజనం చేస్తున్న పేదల నుంచి కక్ష్య పూరితంగా టీడీపీ ఆహార పదార్థాలను పోలీసులు లాక్కెళ్లారు. అన్నదానం చేసే టీడీపీ వర్గీయలపై దాడి చేశారు. ఈ క్రమంలో టీడీపీ, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన చేపట్టింది. 


ఈ పరిస్థితుల నేపథ్యంలో ‘‘పేదవాడి పొట్ట కొట్టాలనే రాక్షసత్వాన్ని ఏమనాలి?. అన్న క్యాంటీన్లు వైసీపీలో దడ పుట్టిస్తున్నాయా?. అన్న క్యాంటీన్లను ధ్వంసం చేయడం పైశాచికత్వం కాదా?. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు నిలిపివేశారు. అన్నం పెట్టని, ఆరోగ్యం కాపాడలేని జగన్ పాలకుడేనా?. తండ్రి పథకాలన్నింటినీ జగన్ ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నాడు?. వైఎస్ఆర్ సహచరులు, అభిమానుల ఆవేదనకు కారణాలేంటి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Read more