ధరలు పెంచారు.. చెత్తపన్ను రుద్దారు!

ABN , First Publish Date - 2022-08-01T08:46:03+05:30 IST

నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలోని 30వ వార్డులో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదివారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం

ధరలు పెంచారు.. చెత్తపన్ను రుద్దారు!

గడప గడపలో ఆర్థిక మంత్రి బుగ్గనపై మహిళల ఫైర్‌


డోన్‌(రూరల్‌), జూలై 31: నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలోని 30వ వార్డులో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదివారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఆయనకు అడుగడుగునా సమస్యలు స్వాగతం పలికాయి. మహిళల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మంత్రి వివరించే ప్రయత్నం చేసినా మహిళలు పట్టించుకోలేదు. పైగా ధరలు పెంచారు.. చెత్తపన్నును బలవంతంగా రుద్దారంటూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవి అనే మహిళ మంత్రితో మాట్లాడుతూ.. గతంలో రూ.98 ఉన్న వంటనూనె ప్రస్తుతం రూ.200కు పెరిగిందని ఇలా అయితే ఏం తినాలి.. ఎలా బతకాలని నిలదీశారు.


మరో వైపు చెత్త పన్ను కింద బలవంతంగా రూ.60 వసూలుకు సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి పట్టణ సుందరీకరణకు తీసుకుంటున్న చర్యల గురించి తెలియపరిచే ప్రయత్నం చేశారు. అయినా.. ఆమె మంత్రిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. తమ గోడును కూడా అర్థం చేసుకోవాలని మొర పెట్టుకున్నారు. దీంతో మంత్రి సమాధానం చెప్పలేక వెళ్లిపోయారు. 

Read more