వైసీపీకి ఉలికిపాటు ఎందుకో?

ABN , First Publish Date - 2022-08-10T09:34:54+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీని టీడీపీ అధినేత చంద్రబాబు కలిస్తే... వైసీపీకి ఉలికిపాటు ఎందుకని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి ప్రశ్నించారు.

వైసీపీకి ఉలికిపాటు ఎందుకో?

  • మోదీతో చంద్రబాబు మాట్లాడితే తప్పేంటి
  • టీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చేందుకే సజ్జల వ్యాఖ్యలు: విష్ణువర్ధన్‌ రెడ్డి

అనంతపురం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీని టీడీపీ అధినేత చంద్రబాబు కలిస్తే... వైసీపీకి ఉలికిపాటు ఎందుకని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీని చంద్రబాబు కలిసిన వేదిక ఏదనేది సజ్జల రామకృష్ణారెడ్డికి, ఆ పార్టీ నాయకులకు కనబడలేదా? అని ప్రశ్నించారు. కలిస్తేనే... మాట్లాడుకుంటేనే ఎన్నికల పొత్తులు అయిపోతాయా? అని నిలదీశారు. ప్రధాని మోదీకున్న సంస్కారంలో భాగంగానే... ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఏపీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబును గౌరవించి మాట్లాడారని అన్నారు. వారిద్దరూ చేతులు కలుపుకుంటే... ఆ పంచాయితీ వైసీపీకి ఎందుకు అని ప్రశ్నించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన చేయకుండా, టీడీపీ, బీజేపీ పొత్తుపై మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఏపీలో పాలన, రాజకీయాల గురించి మాట్లాడమంటే.. పక్క రాష్ర్టాల రాజకీయాలపై సజ్జల మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో టీఆర్‌ఎ్‌సకు లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో భాగంగానే సజ్జల అలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. 

Read more