సర్కార్‌నా.. డీజీపీనా.. ఎవరిని డిస్మిస్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-08-31T09:14:56+05:30 IST

న్యాయం కోసం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన ఓ బాధితురాలిని మీ పాపానికి పావుగా చేసుకుంటారా? మీరు అక్రమంగా విధుల నుంచి తొలగించిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ నిందితుడు కాదని స్వయంగా బాధిత

సర్కార్‌నా.. డీజీపీనా.. ఎవరిని డిస్మిస్‌ చేయాలి

ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఉదంతంపై చంద్రబాబు


అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): న్యాయం కోసం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన ఓ బాధితురాలిని మీ పాపానికి పావుగా చేసుకుంటారా? మీరు అక్రమంగా విధుల నుంచి తొలగించిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ నిందితుడు కాదని స్వయంగా బాధిత మహిళే చెప్పింది. ఇప్పుడెవరిని సస్పెండ్‌ చేయాలి.. డీజీపీనా?. వైసీపీ ప్రభుత్వాన్నా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.  దీనికి సమాధానం చెప్పగలరా? అని మంగళవారం ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. 

Read more