రెండుసార్లు గెలిచి అల్లూరికి ఏం చేశావు?

ABN , First Publish Date - 2022-01-03T09:09:30+05:30 IST

రెండుసార్లు గెలిచి అల్లూరికి ఏం చేశావు?

రెండుసార్లు గెలిచి అల్లూరికి ఏం చేశావు?

వేదిక పైనే అవంతిని నిలదీసిన మోహన్‌బాబు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ‘‘అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డపై రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచావు. ఆయన కోసం ఏం చేశావు?’’ అని మంత్రి అవంతి శ్రీనివా్‌సను నటుడు మోహన్‌బాబు ప్రశ్నించారు. వేదికపైనే మంత్రి అవంతిని మోహన్‌బాబు నిలదీయడంతో పక్కనే కూర్చున్న కిషన్‌రెడ్డి జోక్యం చేసుకొని విషయాన్ని వదిలేయాలని కోరారు. ‘మంత్రి చెబుతున్నారు కాబట్టి వదిలేస్తున్నా’ అని మోహన్‌ బాబు అనడంతో నవ్వులు విరిసాయి. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘‘అవంతి నాకు మిత్రుడు. సీతారామరాజు చిత్రం కోసం రూ.300 జీతంతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా’’ అని మోహన్‌బాబు అన్నారు. 

Read more