MP Raghurama: మా ఆస్తులపై మీ బొమ్మలేంటి?..

ABN , First Publish Date - 2022-10-03T22:10:16+05:30 IST

మా ఆస్తులపై మీ బొమ్మలేంటి?.. రీ సర్వే పేరుతో సొమ్ములు కొట్టేయాలని చూస్తున్నారు.. 70శాతం భూములున్నవారిపై మీ బొమ్మ వేసుకుంటారా?..

MP Raghurama: మా ఆస్తులపై మీ బొమ్మలేంటి?..

ఢిల్లీ: ‘‘మా ఆస్తులపై మీ బొమ్మలేంటి?.. రీ సర్వే పేరుతో సొమ్ములు కొట్టేయాలని చూస్తున్నారు.. 70శాతం భూములున్నవారిపై మీ బొమ్మ వేసుకుంటారా?.. దీనికి నేను ఒప్పుకోను.. అవసరమైతే కోర్టుకు వెళ్తా’’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. రేషన్‌పై ప్రభుత్వం కొత్త స్కీమ్ పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పీడీఎస్‌లో ఇచ్చే బియ్యం బదులు.. డబ్బు ఇస్తామంటున్నారని తప్పుబట్టారు. రాజధాని వికేంద్రీకరణపై ఎంపీ భరత్ సభకు బుద్ధిలేని మంత్రులు హాజరవుతున్నారని దుయ్యబట్టారు. కోర్టు అనుమతితో అమరావతి యాత్ర జరుగుతోందని తెలిపారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రాష్ట్రపతి పాలన రావడం ఖాయమని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.


Read more