బ్లేడ్‌తో చేయికోసుకుని యువకుడి హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-09-25T05:22:00+05:30 IST

పోలీస్టేషన్‌ వద్ద ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు.

బ్లేడ్‌తో చేయికోసుకుని యువకుడి హల్‌చల్‌

జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 24 : పోలీస్టేషన్‌ వద్ద ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు.  మండలంలోని దేవులపల్లి గ్రామానికి చెందిన సీతారాముడు  లక్కవరం పోలీస్టేషన్‌ ఆవరణలోకి వచ్చి చేతిపై బ్లేడుతో కోసుకుంటూ హల్చల్‌ చేశాడు. దీంతో రక్తం ఎక్కువగా పోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సీతారాముడుని బంధువుల సహకారంతో స్థానిక పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించారు. సీతారాముడుపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు. ఇది ఇలా ఉండగా ఎందుకు బ్లేడుతో కోసుకున్నావు అని సీతారాముడును అడగ్గా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు.


Read more