విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-09-17T07:32:12+05:30 IST

కృష్ణవరంలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై వేముల శ్రీనివాసరావు (19) అనే యువకుడు మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ఆగిరిపల్లి, సెప్టెంబరు 16:  కృష్ణవరంలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై వేముల శ్రీనివాసరావు (19) అనే యువకుడు మృతి చెందాడు. బాపుల పాడు  మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన మృతుడు ఉదయం కూలి పనుల నిమిత్తం కృష్ణవరం గ్రామానికి వచ్చాడు.  కొత్తగా నిర్మిస్తున్న ఇంటిలో మట్టిపని చేస్తుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న కరెంటు స్తంభం వైరుకు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఆగిరిపల్లి ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Read more