613 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-24T05:04:01+05:30 IST

కొవిడ్‌ వ్యాప్తి జిల్లా వ్యాప్తంగా కొనసాగు తోంది.

613 మందికి పాజిటివ్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 23 : కొవిడ్‌ వ్యాప్తి జిల్లా వ్యాప్తంగా కొనసాగు తోంది. ఆదివారం మొత్తం 613 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా ఏలూరు, పరిసర రూరల్‌ ప్రాంతాలు, పెదపాడు, పెదవేగి తదితర ప్రాంతాల్లోనే అత్యధికంగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. తాజా కేసులతో జిల్లాలో మొత్తం 55 కంటైన్మెంట్‌ జోన్‌లు ప్రారంభించగా, ఇప్పటివరకు 1943 మంది బాధితులు హోం ఐసో లేషన్‌, ఆసుపత్రుల్లోను ఉన్నారు. కాగా రసాయనాలతో వారానికో రోజు కొవిడ్‌ పరీక్షల ల్యాబ్‌ను శుభ్రపరిచే నిమిత్తం మూసివేస్తారు. ఆ మేరకు ఆర్‌టీపీసీఆర్‌ ల్యా బ్‌ను ఆదివారం మూసివేసినందున సేకరించిన శాంపిళ్లను సోమవారం పరీక్షిస్తారు.

Read more