రేషన్‌పై.. కెమెరా కన్ను!

ABN , First Publish Date - 2022-11-30T00:33:46+05:30 IST

రేషన్‌ బియ్యం పంపిణీ లో అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా మోసాలకు చెక్‌ పడడం లేదు.

రేషన్‌పై.. కెమెరా కన్ను!

సంచార వాహనాలకు జీపీఎస్‌, సీసీ కెమెరాలు

పట్టణ, మండలంలో ఒక్కొక్క వాహనంలో ప్రయోగాత్మకంగా అమలు

నరసాపురం, నవంబరు29: రేషన్‌ బియ్యం పంపిణీ లో అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా మోసాలకు చెక్‌ పడడం లేదు. అక్రమార్కులు సరికొత్త విధానాల తో దోపిడీకి తెర తీస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టేం దుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం బియ్యంను పంపిణీ చేస్తున్న సంచార వాహ నాలకు జీపీఎస్‌తో పాటు సీసీ కెమెరాలను అమర్చి పంపిణీపై నిఘా ఉంచనున్నారు. ప్రయోగాత్మకంగా జిల్లాలోని ప్రతి మండలం, పట్టణ నుంచి ఒక్కొక్క వాహనాన్ని ఎంపిక చేయనున్నారు. వాటికి జీపీఎస్‌ను అమర్చి ఫలితాలను బట్టి మిగిలిన వాహనాలకు ఈ సాంకేతిక విధానాన్ని అమలు చేయాలని యోచిస్తు న్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణ ప్రాంతాల నుంచి జీపీఎస్‌కు అనుసంధానం చేసే వాహనలకు సంబంధించిన ప్రతిపాదనలు జిల్లా సివి ల్‌ సప్లై అధికారులు రప్పించి ప్రభుత్వానికి పంపారు. జిల్లా వ్యాప్తంగా 1100 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. 343 సంచార వాహనాల ద్వారా 5.30 లక్షల మంది కార్డుదారులకు ప్రతినెల బియ్యం పంపిణీ చేస్తున్నారు. గతంలో రేషన్‌ దుకాణాల ద్వారా ఇచ్చేవారు. అయితే లబ్ధిదారులకు నేరుగా అందించాలన్న ఉద్దేశంతో ప్రభు త్వం మొబైల్‌ సంచార వాహనాలను ప్రవేశపెట్టింది. అయినా బియ్యం అక్రమాలకు చెక్‌ పడడం లేదు. కొన్నిచోట్ల బియ్యం సక్రమంగా అందకపోవడం, రేషన్‌ కు బదులు డబ్బులు చెల్లించడం, దళారులు లబ్ధిదారు ల నుంచి బియ్యం కొను గోలు చేయడం, మరికొన్ని చోట్ల వేలిముద్రలు వేయించుకుని బియ్యాన్ని ఇవ్వక పోవడం వంటి అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట బియ్యం తరలిస్తూ పట్టుబ డిన వంటి ఘటనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని ప్రభు త్వం భావించింది. దానిలో భాగంగా మండల, పట్టణ ప్రాంతాల్లో బియ్యం పంపిణీ చేసే వాహనాలకు జీపీ ఎస్‌ను అనుసంధానం చేస్తున్నారు. దీంతో పాటు కెమె రాలు బిగించనున్నారు. ఈ విధానం ద్వారా బియ్యం లోడింగ్‌ తర్వాత వాహనం ఎక్కడెక్కడికి వెళ్లింది, లబ్ధి దారులకు నేరుగా ఇస్తున్నారా.. లేదా అన్న విషయాన్ని సులువుగా తెలుసుకునేందుకు వీలుంటుందని అఽధికా రులు భావిస్తున్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని వాహ నాలకు అమర్చి ఫలితాలు బట్టి అన్ని వాహనాలకు అమలు చేయాలని యోచిస్తున్నారు. ఈ విధానంపై జిల్లా అసిస్టెంట్‌ సివిల్‌ సప్లై అధికారి రవిశంకర్‌ మాట్లాడుతూ ‘గతంలో గుర్తించిన లోపాలు, అక్రమా లు నిరోధించేం దుకు జీపీఎస్‌ ఉపయోగపడుతుంది. ముందుగా ఒక వాహనానికి అమర్చి పనితీరును పరి శీలిస్తాం. దశల వారీగా మిగిలిన వాహనాలకు అమ లు చేస్తాం. నిబంధనల ప్రకారం సంచార వాహనం పంపిణీ సమయం లో నాలుగైదు చోట్ల అగి రేషన్‌ను అందించాలి. ఆ విఽధంగా జరుగుతోందా..లేదా..? అన్న ది ఈ జీపీఎస్‌ ద్వారా తెలుస్తుంది.

Updated Date - 2022-11-30T00:33:46+05:30 IST

Read more