టీడీపీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు తెరుస్తాం : షరీఫ్‌

ABN , First Publish Date - 2022-09-09T05:26:14+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్‌ లను తిరిగి తెరుస్తామని శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎంఏ షరీష్‌ చెప్పారు.

టీడీపీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు తెరుస్తాం : షరీఫ్‌
అన్న క్యాంటీన్‌ వద్ద భోజనం వడ్డిస్తున్న శాసన మండలి మాజీ చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌, తదితరులు

నరసాపురం, సెప్టెంబరు 8 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్‌ లను తిరిగి తెరుస్తామని శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎంఏ షరీష్‌ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ సమీపంలో పార్టీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను  గురువారం ఆయన ప్రారంభించారు. ఆనం తరం విలేకరులతో మాట్లాడుతూ పేదలకు అన్న పెట్టాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన క్యాంటీన్‌లను వైసీపీ ప్రభు త్వం మూనివేయడం సిగ్గు చేటన్నారు. ఈ క్యాం టీన్లను నిర్వహిస్తే తెలుగుదేశానికి పేరు ప్రతిష్టలు వస్తాయన్న దురుద్దేశ్యంతోనే వైసీపీ అధికారంలోకి రాగానే వీటిని మూసివేసి పేదవాడి కడుపు కొట్టిందని మండిపడ్డారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామ రాజు మాట్లాడుతూ పేదల కోసం టీడీపీ నాయకులు కొన్ని నియోజక వర్గాల్లో క్యాంటీన్లను నిర్వహిస్తుంటే వారిపై ప్రభుత్వం కేసులు పెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వ అరాచకాలు, దౌర్జన్యాలకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు రఢీ అయ్యారన్నారు. మొగల్తూరు మండలంలోనూ అన్న క్యాంటీన్‌ తెరిచి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్‌ రాజ్యలక్ష్మి, జక్కం శ్రీమన్నా రాయణ, కొల్లు పెద్దిరాజు, కొప్పాడ రవి, పాలూరి బాబ్జీ, సంకు భాస్కర్‌, మల్లాడి, మూర్తి, పద్మా, షేక్‌ హుస్సేన్‌, చిన్నాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read more