విద్యా దీవెన.. అందేనా?

ABN , First Publish Date - 2022-11-24T00:34:56+05:30 IST

విద్యాదీవెన సొమ్ములు విడుదలపై ప్రభుత్వం వాయిదాలు వేస్తోంది.

   విద్యా దీవెన.. అందేనా?

2021–22 చివరి క్వార్టర్‌ మరిచారు.. 2020–21 చివరి క్వార్టర్‌ ఎగ్గొట్టారు..

లబోదిబోమంటున్న విద్యార్థులు

ఆర్థిక ఇబ్బందుల్లో కళాశాలలు .. ప్రభుత్వం తాత్సారం

ఏడాది ఆలస్యంగా ఫీజులు విడుదల

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

విద్యాదీవెన సొమ్ములు విడుదలపై ప్రభుత్వం వాయిదాలు వేస్తోంది. కళాశాలలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. విద్యార్థులపై భారం మోపు తోంది. నవంబరు మొదటి వారంలో ఒక క్వార్టర్‌ విద్యా దీవెన సొమ్మును విడుదల చేస్తారని అంతా ఆశించారు. ప్రభుత్వం మాత్రం తాత్సారం చేస్తూ వస్తోంది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తోంది. జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్‌, డిప్లొమా, ఇంటర్‌ విద్యార్థులకు 2021–22 చివరి క్వార్టర్‌కు సంబంధించి దాదాపు రూ.25 కోట్లు విడుదల చేయాలి. ఇప్పటికే 2022–23 విద్యా సంవ త్సరానికి సంబంధించి మూడు క్వార్టర్‌లు దాటిపోతున్నాయి. అంటే ఏడాది ఆలస్యంగా ప్రభుత్వం విద్యాదీవెన అమలు చేస్తోంది. అదికూడా అనుకున్న రోజుకు విడుదల చేయకపోవడంతో కళాశాలలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడు తున్నాయి. తీరా ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత సకాలంలో విద్యా ర్థులు కళాశాలలకు చెల్లిం చడం లేదు. కళాశాలలకు ఫీజులు చేరుకునేసరికి మరింత జాప్యం జరుగుతోంది. యాజమాన్యాలు విద్యార్థుల వెంట పడాల్సి వస్తోంది. ఇదేమని ప్రశ్నించలేని దుస్థితిలో కళాశాలలున్నాయి. విద్యార్థుల తల్లుల ఖాతాలోకి విద్యా దీవెన సొమ్ములు వేయడం వల్ల ఇటువంటి పరిస్థి తులు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం దీవెన సొమ్ములు విడుదల చేసిన తర్వాత అధికారులకు పరీక్ష అవుతోంది. విద్యార్థులు సక్రమంగా ఫీజులు చెల్లించేలా చూడాలంటూ జిల్లా అధికారులకు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. వలంటీర్లు విద్యార్థుల వెంటపడుతున్నారు. అయినా విద్యార్థులు పూర్తిస్థాయి లో ఫీజులు చెల్లించడం లేదు. జిల్లాలో ఇలా వందల సంఖ్యలోనే చెల్లించని విద్యార్థులున్నారు. వారి ఫీజులను ఇకపై కళాశాలల ఖాతాలో జమ చేయను న్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా కంటితడుపు చర్యలకు పాల్ప డుతోంది. ఇవేమీ యాజమాన్యాలకు ఊరటనివ్వడం లేదు. పైగా విద్యా ర్థుల కు భారమై కూర్చుంటోంది. తల్లిదండ్రులు వ్యక్తిగత అవసరాలకు సొమ్ములు వినియోగించుకుంటే కళాశాలల్లో విద్యార్థులు అభాసుపాలవుతున్నారు. యాజమాన్యాల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఒక క్వార్టర్‌ విద్య దీవెన సొమ్ము విడుదల చేయకపోవడంతో ఆ భారమంతా విద్యార్థులపై పడింది. నిజానికి 2020–21 చివరి క్వార్టర్‌ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయలేదు. అధికారులు మాత్రం నోటి మాట ద్వారా ఇక సదరు క్వార్టర్‌ సొమ్ములపై ఆశలు వదులు కోవా లంటూ కళాశాల యాజమాన్యాలకు వివరిస్తున్నారు. అయితే విద్యా ర్థులపై ఆ భారం పడుతుందన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ప్రభుత్వం చెల్లించని క్వార్టర్‌కు సంబంధించి యాజమాన్యాలు విద్యార్థుల వద్ద ముక్కుపిండి ఫీజులు వసూలు చేశాయి. ఫీజును చెల్లించని ప్రభుత్వం దీనిపై కళాశాలలను ప్రశ్నించలేకపోయింది. దీంతో ప్రభుత్వం ఫీజు చెల్లించకపోయినా విద్యార్థుల నుంచి వసూలు చేసుకుని సర్టిఫికేట్‌లు ఇస్తున్నారు. జిల్లాలో 2021–22 విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులు ముందుగా ఫీజు చెల్లించిన తర్వాతే సర్టిఫికేట్‌లు ఇచ్చారు. గతంలో బకాయిలు ఉన్నా విద్యార్థులకు ఇబ్బంది పెట్టేవారు కాదు. ప్రభుత్వం కళాశాలలకు బకాయిలు చెల్లించేది. కళా శాలల ఖాతాల్లోనే ఫీజు రీఎంబర్స్‌ చేసేది. విద్యార్థులకు ఎటువంటి ప్రయాస ఉండేది కాదు. ఇప్పుడు చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులు ముందుగా మూడు క్వార్టర్‌లు ఫీజు చెల్లించాల్సి వస్తోంది. అంటే జిల్లాలో రూ. 75 కోట్ల మేర విద్యార్థులు సొంత సొమ్మును చెల్లించాలన్నమాట. తదుపరి తీరుబడిగా ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో ఫీజును జమ చేస్తుంది. ప్రభుత్వం ఫీజు విడుదల తాత్సారం చేస్తుండడంతో అటు విద్యార్థులు, ఇటు యాజమాన్యాలు బలవుతు న్నాయి. అందరిలోనూ అసంతృప్తి రాజ్యమేలుతోంది. మధ్యలో అధికారులు నలిగిపోతున్నారు. ఇప్పటికే చదువు పూర్తి చేసుకుని కళాశాలలకు ఫీజులు చెల్లించిన విద్యార్థులు ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. చదువుతున్న విద్యార్థులు ఫీజులు ఎప్పటికి వస్తాయోనని కళాశాలలు కళ్లప్పగించి చూస్తున్నాయి.

Updated Date - 2022-11-24T00:34:56+05:30 IST

Read more