ఉపాధ్యాయులకు, విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి

ABN , First Publish Date - 2022-09-09T05:24:23+05:30 IST

జిల్లాలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరిగా ఉండా లని, జూనియర్‌ కళాశాలలు, పాఠశాలల్లో రెండో విడత లో చేపడుతున్న నాడు–నేడు పనులు మొదటిదశ కంటే మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ఉపాధ్యాయులకు, విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ ప్రశాంతి, జేసీ మురళి

భీమవరం, సెప్టెంబరు 8 : జిల్లాలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరిగా ఉండా లని, జూనియర్‌ కళాశాలలు, పాఠశాలల్లో  రెండో విడత లో చేపడుతున్న నాడు–నేడు పనులు మొదటిదశ కంటే మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నాడు–నేడు అదనపు తరగతి గదు లు, ప్రహరీలు, మౌళిక వసతుల కల్పన, రివాల్వింగ్‌ ఫం డ్‌ జమ తదితర అంశాలపై నాడు–నేడు మౌళిక వసతుల కల్పన ప్రభుత్వ సలహాదారు ఎ.మురళి, పాఠశాల విద్యా కమిషనర్‌ సురేష్‌కుమార్‌, విద్యా శాఖ మౌళిక వసతుల కల్పన కమిషనర్‌  కాటమనేని భాస్కర్‌లతో కలిసి జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్తలు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పనులను యాప్‌లో నమోదు చేయించాలన్నారు. వీసీలో భీమవరం కలెక్టర్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌  పి.ప్రశాంతి, డీఈవో ఆర్‌.వెంకటరమణ, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త శ్యాంసుందర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-09T05:24:23+05:30 IST