-
-
Home » Andhra Pradesh » West Godavari » westgodavari traing class-MRGS-AndhraPradesh
-
డిసెంబరు 31 నాటికి మొదటి దశ వ్యవసాయ గణాంకాలు పూర్తి
ABN , First Publish Date - 2022-09-09T05:21:23+05:30 IST
వచ్చే డిసెంబరు 31 నాటికి మొదటి దశ వ్యవసాయ గణాంకాలను పూర్తిచేసేందుకు రెవెన్యూ అధికారులు సమాయాత్తం కావాలని రాష్ట్ర గణాంకశాఖ సీనియర్ అధికారి లతీఫ్ సూచించారు.

భీమవరం, సెప్టెంబరు 8 : వచ్చే డిసెంబరు 31 నాటికి మొదటి దశ వ్యవసాయ గణాంకాలను పూర్తిచేసేందుకు రెవెన్యూ అధికారులు సమాయాత్తం కావాలని రాష్ట్ర గణాంకశాఖ సీనియర్ అధికారి లతీఫ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే వ్యవసాయం గణాంకాల ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల అమలుకు ప్రణాళికలు రూపొందిస్తాయని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యప్రణాళిక అధికారి కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం 11వ ప్రపంచ వ్యవసా య గణనపై శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా లతీఫ్ మాట్లాడుతూ మొదటి దశలో గ్రామంలోని అన్ని సర్వే సబ్ డివిజన్‌లో కమతం, హక్కుదారులు కౌలు రైతులు వివరాలతో పాటు కుల, లింగ సమాచారం సేకరించాలన్నారు. రెండో దశలో ప్రభుత్వం నిర్ణయించిన 20 శాతం గ్రామాల్లో పంట వివరాలు, నీటి వసతి, కమత వర్గీకరణ చేయాలన్నారు. మూడోదశలో అన్ని సర్వేసబ్ డివిజన్లో పంటల దిగుబడికి అయ్యే మొత్తం ఖర్చు, నికర వ్యవసాయ ఉత్పత్తిని తెలుసుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లోనూ చిన్న, మధ్య, అధిక తరహా సాగు కమతాల వివరాలు సేకరిస్తార న్నారు. ఈ శిక్షణ తరగతుల్లో కార్యాలయ గణాంక అధికారులు, జిల్లా డివిజన్, ఉప మండల గణాంకా అధికారులు పాల్గొన్నారు.