ఏదీ.. జాబ్‌ క్యాలెండర్‌

ABN , First Publish Date - 2022-09-26T05:39:07+05:30 IST

అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన సీఎం జగన్‌ మాట మార్చి మోసగించారని, ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఏదీ? అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ ధ్వజమెత్తారు.

ఏదీ.. జాబ్‌ క్యాలెండర్‌
తణుకులో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

రాష్ర్టానికి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి : పొలిట్‌ బ్యూరో సభ్యుడు పితాని ధ్వజం
తణుకులో నిరుద్యోగ రణం 


తణుకు, సెప్టెంబరు 25 : అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన సీఎం జగన్‌ మాట మార్చి మోసగించారని, ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఏదీ? అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం తణుకు నరేంద్ర సెంటర్‌ వద్ద నిరు ద్యోగ రణం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ఎక్కడంటే చెప్పలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ఎద్దేవా చేశారు. రైతు ఉద్యమం జరుగుతుంటే దానిని అడ్డుకునేలా కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శిం చారు. ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడు తూ అధికారంలోకి వచ్చాక 2 లక్షల 70 వేలు ఉద్యోగాలు, ఏటా జాబు క్యాలెండర్‌, మెగా డీఎస్సీ అంటూ నిరుద్యో గులను ఆశ పెట్టారన్నారు. మూడున్నరేళ్లలో ఒక్క ఉద్యో గం ఇవ్వలేదని విమర్శించారు.
ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ ఉపా ధికి పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవన్నారు. ఏటా ఏడు లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, ఐదు లక్షల మంది ఉత్తీర్ణత సాధిస్తున్నారని, అయితే ఎక్కడా ఉద్యోగం ఇచ్చిన సందర్భాలు లేవన్నారు.
జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ జ గన్‌ మోసపూరిత వాగ్దానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యు వత టీడీపీ అధికారం రావడానికి నడుం బిగించాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ జగన్‌ పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారని, టీచర్స్‌, కాంట్రా క్టు ఉద్యోగుల పర్మినెంట్‌, పోలీసు ఉద్యోగాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పినా అమలుకు నోచుకోలేదన్నారు. వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రం అంధకా రంలోకి పోయిందని విమర్శించారు.
ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ మాట్లాడుతూ నిరుద్యోగుల పట్ల జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు.  
మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడని ప్రశ్నించారు. మాట ఇచ్చి మడమ తిప్పిన వ్యక్తి జగన్‌ అన్నారు.
జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మద్దిపాటి ధర్మేంద్ర మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వస్తున్నా, జగన్‌ తాడేపల్లి పాలెస్‌ నుంచి బయటకు రావ డం లేదన్నారు. కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్త ల్లా పనిచేస్తున్నారని విమర్శించారు. కేసులకు భయపడే ది లేదన్నారు.
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు రామచినబాబు మాట్లా డుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగాలు, ఉపాధి లేక రోడ్డులెక్కుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు.
చిట్టూరి ఇంద్రయ్య కాలేజి వద్ద నుంచి నరేంద్ర సెంటర్‌ వరకు నిరుద్యోగులతో కలిసి పోరాట యాత్ర నిర్వహించా రు. కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జి, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ అజయ్‌, పితాని మోహన్‌, రామ్‌ ప్రసాద్‌చౌదరి, వివిధ నియోజకవర్గాలకు చెందిన నాయ కులు, నిరుద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 

Read more