చంద్రబాబు ఆదరణ చూసి .. ఓర్వలేకపోతున్న జగన్‌

ABN , First Publish Date - 2022-11-30T00:38:38+05:30 IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసిన సీఎం జగన్‌ ఓర్వలేకపోతున్నారని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఇన్‌చార్జ్‌ ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

చంద్రబాబు ఆదరణ చూసి ..  ఓర్వలేకపోతున్న జగన్‌
చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో సమైక్యత చాటుతున్న తెలుగుదేశం నాయకులు

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బండారు

పర్యటనను విజయవంతం చేయండి : తోట

తాడేపల్లిగూడెం అర్బన్‌/పోడూరు/ భీమవరం అర్బన్‌, నవంబరు 29 : తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసిన సీఎం జగన్‌ ఓర్వలేకపోతున్నారని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఇన్‌చార్జ్‌ ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ‘ఇదేం ఖర్మ.. మన రాష్ర్టానికి’ కార్యక్ర మంలో ప్రజలను చైతన్య పరిచేందుకు చంద్రబాబు పర్యటన జరపనున్న ప్రాంతా లను మంగళవారం పరిశీలించారు. తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడారు. కర్నూలు, కృష్ణా జిల్లాల్లో చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి లభించిన విశేష స్పందన చూసిన సీఎం జగన్‌ దెందులూరులో ఎమ్మెల్యేతో పోటీ సమావేశం ఏర్పా టుకు ప్రణాళిక చేశారని మండిపడ్డారు. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ఎన్ని కుయుక్తులకు పాల్పడినా ప్రజా దరణతో చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు. ఏలూరు జిల్లా ఇన్‌చార్జ్‌ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో వరి, ఆక్వా రైతులు ఇదేం ఖర్మ అని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తూర్పుగోదా వరి జిల్లా ఇన్‌ చార్జ్‌ కేఎస్‌ జవహర్‌ మాట్లాడుతూ యువత భవితవ్యం బాగుపడా లంటే చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌ వలవల బాబ్జి మాట్లాడుతూ మంత్రి కొట్టు సత్యనారాయణకు తమ నేతపై ధ్యాస లేకుండా పోయిందని, ఎప్పుడూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ నామస్మ రణ చేస్తున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గొర్రెల శ్రీధర్‌, మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్‌, నియోజకవర్గ యువత అధ్యక్షుడు గంధం సతీష్‌, నాయకులు పోతుల అన్నవరం, ముత్యాల శ్రీనివాస్‌, మద్దుకూరి ధనరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజ ల్లోకి తీసుకెళ్తే రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీదేనని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ నివాసంలో ఆచంట నియోజవర్గ టీడీపీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. మూడు రోజులపాటు ఉమ్మడి జిల్లాలో జరిగే చంద్రబాబు పర్యటనకు ఆచంట నియోజకవర్గ నుంచి అందరూ కలిసికట్టుగా వెళ్లి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. గణపతినీడి రాంబాబు, కేతా మీరయ్య, వెలిశేటి బాబూరాజేంద్రప్రసాదు, గంధం వెంకటరాజు, రుద్రరాజు రవి, బులిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి కోరారు. భీమవరం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో మంగళవారం ఇదేమి ఖర్మ... మన రాష్ర్టానికి కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 45 రోజులపాటు నియోజకవర్గంలోని 11 క్లస్టర్‌లలో, వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి స్థానికుల సమస్యలు తెలుసుకుని నమోదు చేయాలని సీతారామ లక్ష్మి కోరారు. పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ బూత్‌ ఇన్‌చార్జ్‌లు, గ్రామ, వార్డు నాయకులు విధిగా పాల్గొని విజయవంతం చేయాలన్నా రు. చంద్రబాబు సభలకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని మండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో దాసరి ఆంజనేయులు, మెరగాని నారాయణమ్మ, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవాని, మాదాసు కనకదుర్గ, సయ్యద్‌ నసీమా బేగం పాల్గొన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఉమ్మడి పశ్చిమ జిల్లాకు వస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి జిల్లాలోని రైతులు తమ సమస్యలను తీసుకురావాలని జిల్లా తెలు గు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేడి నాగేశ్వరరావు కోరారు. మంగళవారం భీమవరంలో ఆయన మాట్లాడారు.

Updated Date - 2022-11-30T00:38:45+05:30 IST