జగన్‌ పాలనలో అభివృద్ధి తిరోగమనం..

ABN , First Publish Date - 2022-11-24T00:38:43+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో రాష్ట్రం అన్ని రంగా ల్లో ఘోర వైఫల్యం చెందిందని, రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా తిరోగమనంలో పయనిస్తోందని పాలకొల్లు, ఉండి ఎమ్మెల్యే లు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు అన్నారు.

జగన్‌ పాలనలో అభివృద్ధి తిరోగమనం..
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామానాయుడు, చిత్రంలో ఉండి ఎమ్మెల్యే రామరాజు, సీతారామలక్ష్మి

కాళ్ళ, నవంబరు 23 : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో రాష్ట్రం అన్ని రంగా ల్లో ఘోర వైఫల్యం చెందిందని, రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా తిరోగమనంలో పయనిస్తోందని పాలకొల్లు, ఉండి ఎమ్మెల్యే లు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు అన్నారు. పెదఅమిరంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఉండి, భీమవరం, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల టీడీపీ క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలకు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిసెంబరు ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘ఇదేం

ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకెళ్లాలి.. అనే వాటిపై బుధవారం వారు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం లో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులు వద్దకు వెళితే ప్రతీ రైతు మా ధాన్యానికి ఇదేం ఖర్మ అంటూ వాపోతున్నారని తెలిపారు. పట్టాలు ఉన్న మా భూములకు జగన్‌ ప్రభుత్వం సర్వే ఏంటని ప్రజలు ఆవేదన చెందుతున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యోగ రంగంలో ఉన్న ఇబ్బందులతో పాటు తాగునీరు లేకపోవడం, అధిక ధరలు వంటి తదితర 14 అంశాలపై గ్రామాల్లో విశ్లేషణ చేస్తామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోకుండా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం కళ్లు తెరిపించేలా ఈ కార్యక్రమాన్ని చేస్తామని వారు స్పష్టం చేశారు. ప్రతీ నాయకుడు, కార్యకర్త తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసి రాష్ట్రా న్ని జగన్‌ పీడ నుంచి విముక్తి కలిగించాలన్నారు. టీడీపీ కాళ్ళ, ఉండి, పాలకోడేరు మండలాల అధ్యక్షులు జీవీ నాగేశ్వరరావు, జుత్తుగ శ్రీనివాస్‌, డీటీ కోటేశ్వరరాజు, బండారు వేణుగోపాలరావు, భూపతిరాజు తిమ్మరాజు, తోట ఫణిబాబు, గుల్లిపల్లి జోగయ్య, వీరవల్లి శ్రీనివాస్‌, ఉండి, భీమవరం, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల టీడీపీ క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలు, తదితరులు పాల్గొన్నారు.

––––––––––––

Updated Date - 2022-11-24T00:38:43+05:30 IST

Read more