యానాలపల్లి నెంబర్‌–2 పాఠశాల హెచ్‌ఎం సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-11-08T00:07:27+05:30 IST

నిబంధనలకు వ్యతిరేకంగా నాడు–నేడు నిధులు చెక్కు రూపంలో బ్యాంకు నుంచి డ్రా చేసినందుకు మండలంలోని యానాలపల్లి నెంబర్‌ –2 పాఠశాల హెచ్‌ఎం దాసరి విలియం రత్నంరాజును జిల్లా విద్యాశాఖాధికారి రమణ సస్పెండ్‌ చేసినట్టు ఎంఈవో శ్రీనివాస్‌ సోమవారం తెలిపారు.

 యానాలపల్లి నెంబర్‌–2 పాఠశాల హెచ్‌ఎం సస్పెన్షన్‌

పెంటపాడు, నవంబరు 7: నిబంధనలకు వ్యతిరేకంగా నాడు–నేడు నిధులు చెక్కు రూపంలో బ్యాంకు నుంచి డ్రా చేసినందుకు మండలంలోని యానాలపల్లి నెంబర్‌ –2 పాఠశాల హెచ్‌ఎం దాసరి విలియం రత్నంరాజును జిల్లా విద్యాశాఖాధికారి రమణ సస్పెండ్‌ చేసినట్టు ఎంఈవో శ్రీనివాస్‌ సోమవారం తెలిపారు. హెచ్‌ఎం విలియం రత్నంరాజు గతనెల 14వ తేదీ నుంచి మెడికల్‌ లీవ్‌ పెడుతున్నట్టు వాట్సప్‌లో మెసేజ్‌ పంపించారన్నారు. అనంతరం గతనెల 21న రూ.50 వేలు, 28న రూ.20 వేలు, రూ.28 వేలు చొప్పున మొత్తం రూ.98 వేలు బ్యాంకు నుంచి డ్రా చేశారన్నారు. దీనిపై ఎన్నిసార్లు వివరణ కోరినా అతను సరిగా స్పందించని కారణంగా విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపామన్నారు. దీనిపై స్పందించిన డీఈవో రమణ హెచ్‌ఎంను సస్పెండ్‌ చేశారన్నారు. నాడు నేడు పనులకు ఆటకం లేకుండా హెచ్‌ఎం స్థానంలో మరొకరిని నియమించామన్నారు.

––––––––––––––––––

Updated Date - 2022-11-08T00:08:27+05:30 IST

Read more