అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌

ABN , First Publish Date - 2022-09-25T06:15:35+05:30 IST

మండలంలోని పేరుపాలెం సీఆర్‌జడ్‌ (కోస్టల్‌ రెగ్యులేటింగ్‌ జోన్‌) పరిధిలో నిత్యం ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌

 సీఆర్‌జడ్‌ భూముల నుంచి ఇసుక అక్రమ రవాణా

మొగల్తూరు, సెప్టెంబరు 24: మండలంలోని పేరుపాలెం సీఆర్‌జడ్‌ (కోస్టల్‌ రెగ్యులేటింగ్‌ జోన్‌) పరిధిలో నిత్యం ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. గత మూడు నెలల నుంచి  అనుమతు లు లేకుండా ఇసుక మాఫియా సీఆర్‌జడ్‌ భూముల్లోని ఇసుకను తవ్వేసి సుదూర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. కొందరు అధికారులు ఇసుక వ్యాపారుల వద్ద చేతివాటం ప్రదర్శిస్తుండడంతో గ్రామస్థాయిలోనే ఈసమస్య ఉండి పోతోంది. రాజకీయ వత్తిళ్లు ఉండడంతో మండలస్థాయి అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. కేపీపాలెం, రామన్నపాలెం, పేరుపాలెం, వారతిప్ప, కొత్తోట, కాళీపట్నం, పాతపాడు గ్రామాల్లో నిత్యం వందలాది ఇసుక ట్రాక్టర్‌లు  తిరగడంతో అంతంత  రహదారులు దెబ్బతింటు న్నాయి. పేరుపాలెం సీఆర్‌జడ్‌ భూము ల్లో ఇసుక తవ్వకాలను శనివారం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో తహసీల్దార్‌ ఇసుక తవ్వకాలు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించినట్టు తెలిసింది.

Read more