దంచికొట్టింది..

ABN , First Publish Date - 2022-09-10T06:22:47+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

దంచికొట్టింది..
భీమవరం ప్రభుత్వాస్పత్రి వద్ద కాల్వను తలపిస్తున్న రోడ్డు

జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

భీమవరం, సెప్టెంబరు 9 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి మొదలైన వర్షాలు తదుపరి కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం 9 గంటల తర్వాత జోరువాన అందుకుంది. కొన్ని గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురవడంతో రహదారులు, వీధులు, పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. తీరప్రాంత గ్రామాల్లో వర్షపునీరు కాల్వలా ప్రవహించింది. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే  అవకాశం ఉంది. జిల్లాలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఉండి 119, పాలకోడేరులో 114.2, భీమవరంలో 105.8, ఆచంట 82, తాడేపల్లిగూడెం 65.4, వీరవాసరం 62.8, పాలకొల్లు 56.2, పెనుగొండ 56, కాళ్ల 50.4,  తణుకు 45, ఇరగవరం 42.8, పెనుమంట్ర 41.2, అత్తిలి 38, పెంటపాడు 37.6,  పోడూరు 37.4, మొగల్తూరు 35.4, ఆకివీడు 35.2, నరసా పురం 28.6, యలమంచిలి 25.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు.

12 వ రకు సముద్ర వేట నిషేధం 

నరసాపురం, సెప్టెంబరు 9 : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం కారణంగా సముద్రంలో అలల ఉధృతి, ఈదురు గాలులు ఎక్కువగా ఉండే ప్రమా దం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో నరసాపురం, మొగల్తూరు మండలా ల్లోని సముద్ర తీరంలో ఈ నెల 12 వరకు సముద్ర వేటను నిషేధిస్తున్నట్టు మత్ప్య శాఖ ఏడీఈ రాజ్‌కుమార్‌ చెప్పారు. ఇప్పటికే వేటను వెళ్లిన బోట్లకు అంతర్వేది లైట్‌ హౌస్‌ ద్వారా వెనక్కి రప్పిస్తున్నామన్నారు.  

Updated Date - 2022-09-10T06:22:47+05:30 IST