-
-
Home » Andhra Pradesh » West Godavari » westgodavari notice-NGTS-AndhraPradesh
-
103 మంది హెచ్‌ఎంలకు షోకాజ్ నోటీసులు !
ABN , First Publish Date - 2022-02-23T05:33:17+05:30 IST
అమ్మ ఒడి నగదు సాయానికి కీలకమైన విద్యార్థుల హాజరు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరిం చిన 103 మంది ప్రాథమిక, ప్రాఽథ మికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

ఏలూరు ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 22 : అమ్మ ఒడి నగదు సాయానికి కీలకమైన విద్యార్థుల హాజరు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరిం చిన 103 మంది ప్రాథమిక, ప్రాఽథ మికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. చైల్డ్ ఇన్ఫోతో అనుసంధానించిన స్టూడెంట్ యాప్‌లో రోజూ విద్యార్థుల హాజరును అప్‌లోడ్ చేయని హెచ్‌ఎంలపై క్రమశిక్షణా చర్యలు తీసుకో వాలని, ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలపై పెనాల్టీలు వేయాలని విద్యాశాఖ కమిషనర్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. కనీస హాజరు 75 శాతం ఉన్న విద్యార్థులకే అమ్మఒడి సాయం అందుతుందని ప్రభు త్వం స్పష్టం చేసింది. కొందరు హెచ్‌ఎంల నిర్లక్ష్యం కారణంగా పలువు రు విద్యార్థులు స్కూలుకు వస్తున్నా అమ్మ ఒడికి దూరమయ్యే పరిస్థి తులు ఏర్పడ్డాయి. అధికారికంగా ఇంకా నిర్ణయం తీసుకోలేదు.