-
-
Home » Andhra Pradesh » West Godavari » westgodavari mavullama-NGTS-AndhraPradesh
-
నేడు మావుళ్లమ్మ ట్రస్టు బోర్డు ప్రమాణం
ABN , First Publish Date - 2022-04-24T05:34:08+05:30 IST
మావుళ్ళమ్మ దేవస్థానం నూతన పాలకవర్గం ఆది వారం ఉదయం 10.41 గంటలకు ప్రమా ణ స్వీకారం చేయనున్నట్టు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాద్ తెలిపారు.

భీమవరం టౌన్, ఏప్రిల్ 23 : మావుళ్ళమ్మ దేవస్థానం నూతన పాలకవర్గం ఆది వారం ఉదయం 10.41 గంటలకు ప్రమా ణ స్వీకారం చేయనున్నట్టు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాద్ తెలిపారు. చైర్మన్‌గా మానేపల్లి నాగేశ్వరరావు, సభ్యులుగా రామాయణం సత్యనారాయణ, ముత్యాల వెంకటరామారావు, సీహెచ్ నాగశేషగిరి, మావూరి సుందరరావు, టి.భాగ్యలక్ష్మి, కె.వెంకటలక్ష్మి, జి.విజయలక్ష్మి, నాగలక్ష్మితోపాటు ఎక్స్ అఫిషియో సభ్యునిగా ప్రధానార్చకుడు మద్దిరాల మల్లిఖార్జున శర్మ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ప్రత్యేక ఆహ్వానితునిగా ఎస్.శివకుమార్‌ను నియమించారని తెలిపారు.