36 కుష్టు కేసులు గుర్తింపు

ABN , First Publish Date - 2022-12-13T00:16:01+05:30 IST

జిల్లాలో ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కుష్టువ్యాధి కేసుల గుర్తింపు సర్వే నిర్వహించారు.

36 కుష్టు కేసులు గుర్తింపు

ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడి

భ యం వద్దు : వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

జిల్లాలో కొనసాగుతున్న రీ–సర్వే

భీమవరం టౌన్‌, డిసెంబరు 12 : జిల్లాలో ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కుష్టువ్యాధి కేసుల గుర్తింపు సర్వే నిర్వహించారు. ఇంటింటి సర్వేలో 36 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే గతనెల 15వతేదీ నుంచి ఈనెల 5వరకు నిర్వహిం చారు. ఇంటింటికి వెళ్లి ప్రతీ ఒకరిని పరిశీలించి మచ్చలు ఏమైనా ఉంటే వెంటనే వైద్యాధికా రులకు సమాచారం ఇచ్చారు. సర్వే చేసిన వెంటనే వివరాలను అదేరోజు ఆన్‌లైన్‌లో నమోద చేసేవారు. తద్వారా అధికారులకు జిల్లా సమాచారం వెంటనే అందుబాటులోకి వచ్చేది. సర్వే పూర్తయిన నేపథ్యంలో మరోసారి సర్వే చేయా లని నిర్ణయించడంతో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రీ– సర్వే నిర్వహిస్తు న్నారు. ఈ వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించాలన్న ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టడంతో మరింత లోతుగా సర్వే జరుగుతోంది. ప్రస్తుతం నమోదైన కేసుల విషయంలో వైద్యాధికారులు ఇబ్బంది లేదనే చెబుతున్నారు. జిల్లాలో 18 లక్షల మంది జనాభా ఉన్న నేపథ్యంలో కేసులు నమోదు విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. సర్వేలో కాకుండా ఎవరైనా ఆస్పత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకుంటే కుష్టుగా నిర్ధారణ అయి తే నివారణ చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతు న్నారు మల్టీడ్రగ్‌ థెరిపీ (ఎండీటీ) ద్వారా రోగికి వైద్య సహాయం అందించడంతో కొద్దినెలలల్లోనే పూర్తిగా నయం అవుతుందంటున్నారు. జిల్లాలో అసి స్టెంట్‌ పారా మెడికల్‌ అసిస్టెంట్స్‌ (ఏపీ ఎంవో)లు పీహెచ్‌సీలను విజిట్‌ చేసి మందుల ను అందిస్తారని చెబుతున్నారు. అయినప్పటికీ తమ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. కుష్టు వ్యాధి కేసుల ఉనికి బయట పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్ట బోతోందో వేచిచూడాలి.

––––––––––––––––––––––––

Updated Date - 2022-12-13T00:16:05+05:30 IST