కబ్జా భూమి పరిశీలన

ABN , First Publish Date - 2022-12-10T00:10:56+05:30 IST

దొడ్డనపూడిలో అధికార పార్టీ నేత కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు శుక్రవారం పరిశీలించారు.

కబ్జా భూమి పరిశీలన
కబ్జాకు గురైన పొలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

కాళ్ళ, డిసెంబరు 9 : దొడ్డనపూడిలో అధికార పార్టీ నేత కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ‘దర్జాగా.. కబ్జా’ శీర్షిక న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై జిల్లా రెవె న్యూ యంత్రాంగం స్పందించింది. భీమవరం ఆర్డీవో దాసిరాజు ఆదేశాల మేరకు మండలస్థాయి అధికారులు ఆక్రమణకు గురైన భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాఘవమూర్తిరాజు ఆధ్వర్యంలో వీఆర్వో, రెవెన్యూ సిబ్బంది ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో గట్టు వేసినట్టు గుర్తించామన్నారు. 205/1ఏ లో ఉన్న 90 సెంట్లు భూమికి సంబంధించి 65 సెంట్లు గతంలో వేరే వ్యక్తి నుంచి తాము కొనుగోలు చేసినట్టు సంబంధిత రైతు వీఆర్వోకి తెలిపారన్నారు. పూర్తిస్థాయి రికార్డు రప్పించుకుని విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు తెలి పారు. అయితే ఇదే భూమిని గతంలో తవ్వుతుండగా ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు మూడుసార్లు నిలుపుదల చేసిన అంశాన్ని అధికారులు గుర్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌ అడం గళ్‌లో సదరు సర్వే నెంబర్లలో ఉన్న భూమి ప్రభుత్వ పోరంబోకుగా ఉందని దీనికి పట్టా ఎలా ఇచ్చారు..? అనే అంశాన్ని విచార ణ చేసి నివేదిక సమర్పించాలని వీఆర్వో ఏడుకొండలను ఆదేశించారు. కలవపూడి వీఆర్వో కెనడీ, రైతులు ఉన్నారు.

–––––––––––

Updated Date - 2022-12-10T00:10:56+05:30 IST

Read more