గోదావరికి వరద పోటు

ABN , First Publish Date - 2022-09-13T05:32:29+05:30 IST

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గోదావరికి వరద నీరు చేరడంతో కోడేరు వద్ద గోదావరి ప్రవా హం పెరిగింది.

గోదావరికి వరద పోటు
కోడేరు వద్ద పెరిగిన వశిష్ఠ గోదావరి

ఆచంట/భీమవరం/తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 12: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గోదావరికి వరద నీరు చేరడంతో కోడేరు వద్ద గోదావరి ప్రవా హం పెరిగింది. ఇసుక తెన్నెలు నీట మునిగాయి. ఎప్పుడు లేని విధంగా ఈసారి  గోదావరి ఇప్పటికే రెండుసార్లు ఉగ్రరూపం దాల్చింది. గోదావరి పెరుగుతుండడంతో లంక వాసులు ఆందోళన చెందుతున్నారు.  
 జిల్లాలో వర్షపాతం..
 జిల్లాలో సోమవారం ఉదయం నాటికి 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వర్షపాతం ఆచంటలో 27.0 మిల్లీ మీటర్లు, అత్యల్ప వర్షపాతం తాడేపల్లిగూడెంలో 1.2 మి.మీ నమోదు కాగా సరాసరి వర్షపాతం 7.3 మి.మీ నమోదయింది. భీమవరంలో 6.2, వీరవాసరం 2.2, కాళ్ళ 4.0, ఆకివీడు 1.4, ఉండి 8.6, పాలకోడేరు 11.2, అత్తిలి 2.2, పోడూరు 20.2, పెనుగొండ 18.2, ఇరగవరం 7.8, పెనుమంట్ర 5.6, మొగల్తూరు 8.4, నరసాపురంలో 8.8 మి.మీ నమోదైంది.
నీటమునిగిన వరిచేలు
ఎగువన కురిసిన వర్షాలకు ఎర్రకాల్వ ఉధృతి పెరగడంతో తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం, మాధవరం, మారంపల్లి గ్రామాల్లో 500 ఎకరాల వరిచేలు సోమవారం నీటమునిగాయి. కాల్వ గట్లు పటిష్టం చేసి ఇన్‌లెట్‌ అవుట్‌లెట్‌ గేట్లు ఏర్పాటు చేయక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని  రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకో కుండా వదిలేయడం వల్ల తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Updated Date - 2022-09-13T05:32:29+05:30 IST