ఆచంటలో వైభవంగా కర్పూరజ్యోతి

ABN , First Publish Date - 2022-11-07T23:47:26+05:30 IST

ప్రసిద్ధ ఆచంట రామేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం సాయం త్రం కార్తీక మాసం సందర్భంగా కర్పూర జ్యోతి (అఖండజ్యోతి) ప్రజ్వలన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

ఆచంటలో వైభవంగా కర్పూరజ్యోతి
కర్పూర జ్యోతిలో ఆవు నెయ్యి వేసేందుకు పోటీపడుతున్న భక్తులు

ఆచంట, నవంబరు 7: ప్రసిద్ధ ఆచంట రామేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం సాయం త్రం కార్తీక మాసం సందర్భంగా కర్పూర జ్యోతి (అఖండజ్యోతి) ప్రజ్వలన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన గొడవర్తి వెంకన్నబాబు కుటుంబ సభ్యులచే ముందుగా ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, అనంతరం కృత్తికా హోమాన్ని చేపట్టారు. వేలమంది భక్తుల సమక్షంలో అఖం డ జ్యోతిని వెలిగించారు. వివిధ ప్రాంతాలకు చెందినవారు హాజర య్యారు. అఖండ జ్యోతిలో ఆవు నెయ్యి వేయడానికి భక్తులు ఎగబడ్డారు. తర్వాత చంద్రశేఖర స్వామి వారి ప్రబలోత్సవం జరిగింది. ఎస్‌ఐ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో రాము, చైర్మన్‌ నెక్కంటి రామలింగేశ్వరరావు, ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-11-07T23:47:26+05:30 IST

Read more