ఉచిత బియ్యం.. ఉన్నట్టా..? లేనట్టా?

ABN , First Publish Date - 2022-06-12T06:33:09+05:30 IST

ఉచిత బియ్యం ఉన్న ట్టా..? లేనట్టా...? అంటూ కార్డుదారులు ఎదురు చూస్తున్నారు.

ఉచిత బియ్యం..  ఉన్నట్టా..? లేనట్టా?

పీఎంజీకేవై బియ్యం కోసం  ఎదురు చూస్తున్న కార్డుదారులు

రెండు నెలలుగా ఆ ఊసే ఎత్తని రాష్ట్ర ప్రభుత్వం

ఉండి, జూన్‌ 11: ఉచిత బియ్యం ఉన్న ట్టా..? లేనట్టా...? అంటూ కార్డుదారులు ఎదురు చూస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేం దుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) పథకం కింద ఉచిత బియ్యం ఇచ్చి ఆదుకుంది. కరోనా సమయంలో ప్రజలు బయటకు వెళ్లలేక, పనులు లేక పేదలు పస్తులతో గడుపుతున్న సమయంలో ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఉచిత రేషన్‌ బియ్యం ప్రకటించా రు. 2020 మార్చి నుంచి 2021 మార్చి వరకు సుమారు గా రెండేళ్ల పాటు ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు పరిచింది. తొలుత ప్రకటించినట్టుగా ఈ ఏడాది మార్చితో ఉచిత బియ్యం పఽథకం ముగిసింది. అయితే ప్రధాని మోదీ మరో ఆరు నెలల పాటు అంటే సెప్టెంబరు వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. కేంద్రం నుంచి  ప్రకటన అయితే వచ్చిం ది కాని తర్వాత నెల నుంచి రాష్ట్రంలో ఉచిత బియ్యంను కార్డుదారులకు ఇవ్వడం లేదు.  కార్డు దారులు ప్రతీ నెలా వచ్చి ఉచిత బియ్యం ఎప్పుడు వస్తాయంటూ లబ్ధి దారులు డీలర్లను నిలదీస్తున్నారు.  ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి ఉచిత బియ్యం ఇవ్వలేదు. ప్రస్తుతం జూన్‌ నెలవారీ రేషన్‌ను నగదుకు అందిస్తున్నా రు. ప్రభుత్వం మాత్రం గత రెండు నెలలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యం ఊసే ఎత్తడం లేదు. జూన్‌తో కలిపి మూడు నెలలకు ఒకేసారి ఇస్తారా.. లేదా వేచి చూడాలి. అధికారులెవరు దీనిపై మాట్లాడడం లేదు. కాగా ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టి వారి ద్వారా నగదు సరుకులు ఇవ్వడం ప్రారంభించారు. దాంతో డీలర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో కేంద్రం ఉచిత బియ్యాన్ని డీలర్ల ఆధ్వర్యంలో రేషన్‌ దుకాణాల్లోనే ఇవ్వా లని ఆదేశించడం గమనార్హం. ఉచిత రేషన్‌పై జిల్లా పౌర సరఫరాల శాఖ సహాయ అధికారి రవి శంకర్‌ మాట్లాడుతూ ‘ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని, రాగా నే పంపిణీపై చర్యలు తీసుకుంటాం’.. అని తెలిపారు.  

Read more