15 నుంచి వేట నిషేధం ఎత్తివేత

ABN , First Publish Date - 2022-06-07T06:45:20+05:30 IST

ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి తీరంలో సముద్ర వేటపై నిషేధాన్ని ఎత్తి వేస్తుండడంతో 15 నుంచి కొనసాగించుకోవచ్చని మత్స్యశాఖ అధికారి ఏడుకొండలు చెప్పారు.

15 నుంచి వేట నిషేధం ఎత్తివేత

నరసాపురం, జూన్‌ 6 : ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి తీరంలో సముద్ర వేటపై నిషేధాన్ని ఎత్తి వేస్తుండడంతో 15 నుంచి కొనసాగించుకోవచ్చని మత్స్యశాఖ అధికారి ఏడుకొండలు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి 60 రోజులపాటు వేట నిషేధించడంతో ఎక్కడ బోట్లు అక్కడే ఆగిపోయాయి. వేటపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఆధార పడిన మత్స్యకారులతోపాటు ఎగుమతిదారులు, ఐస్‌ ప్లాంట్లు మూతపడ్డాయి. తీరంలో రెండు నెలలపాటు వేట కళ తగ్గింది. మరో పది రోజుల్లో బోట్లు వేటకు వెళ్లేందుకు సిద్ధం అవుతుండడంతో ఎగుమతి కంపెనీలు ఒక్కొక్కటి తెరుచుకుంటున్నాయి.  

Read more