ఎండుగడ్డి కొరత..

ABN , First Publish Date - 2022-12-12T00:23:13+05:30 IST

ప్రతీ పంటలోను ఎండుగడ్డి మాసూళ్లు రైతు లకు సవాల్‌గా మారుతోంది.

ఎండుగడ్డి కొరత..

ఏడాదికి 17 లక్షల 33 వేల మెట్రిక్‌ టన్నుల గ్రాసం అవసరం

భీమవరం రూరల్‌, డిసెంబరు 11 : ప్రతీ పంటలోను ఎండుగడ్డి మాసూళ్లు రైతు లకు సవాల్‌గా మారుతోంది. ఒకవైపు పంట మాసూళ్లతో పాటు మరోవైపు పశువుల కోసం ఎండుగడ్డి మాసూళ్లు కత్తిమీద సాములా మారింది. తుఫాన్‌ కారణంగా కురి సిన వర్షాలకు చాలాశాతం ఎండుగడ్డి పొలాల్లో తడిచిపో యింది. జిల్లాలో 2లక్షల 16వేల 702 ఆవులు, గేదెలు ఉండగా ఏడాదికి ఎండి పశుగ్రాసంగా 17 లక్షల 33 వేల మెట్రిక్‌ టన్నులు కావాల్సి ఉంటుంది. ఈ ఏడాది రెండు లక్షల 52 వేల ఎకరా ల్లో సార్వా సాగు సాగాల్సి ఉండగా రెండు లక్షల రెండు వేల ఎకరాల్లో మాత్రమే సాగింది. ఇప్పటి వరకు మాసూళ్లు అయిన ఎండుగడ్డి నాలుగు నెలలకు మించి సరిపోదని రైతులు అంటున్నారు. గత పంటలో ట్రాక్టర్‌ ఎండుగడ్డి రూ.6వేలు ఉంటే ఈసారి రూ.8 వేల నుంచి రూ.10 వేలు వరకు అమ్ముతున్నారు. మిషన్‌ ద్వారా చుట్టిన మోపు రూ.35కు అమ్ముతున్నారు. తుఫాన్‌లు, ఆకాల వర్షాలతో ఏడాదిలో సార్వా, దాళ్వా, పంటల్లో సగం గడ్డి మాత్రమే మాసూళ్లు చేయగలుగుతున్నారు.

–––––––––

Updated Date - 2022-12-12T00:23:18+05:30 IST