సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద రైతుల ధర్నా

ABN , First Publish Date - 2022-09-27T05:32:25+05:30 IST

మురుగు కాల్వల డ్రెయి న్లు, తలుపులను ఆధునికీకరించాలంటూ సోమవారం రుస్తుంబాద, సరిపల్లి గ్రామాలకు చెందిన రైతులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద రైతుల ధర్నా
ధర్నా చేస్తున్న రైతులు

నరసాపురం టౌన్‌, సెప్టెంబరు 26: మురుగు కాల్వల డ్రెయి న్లు, తలుపులను ఆధునికీకరించాలంటూ సోమవారం రుస్తుంబాద, సరిపల్లి గ్రామాలకు చెందిన రైతులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు కంచర్ల నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నత్తలొవ డ్రెయిన్‌ పూడిక తీయక పోవడం వల్ల వర్షాలకు పంట నీట మునిగిపోతోందన్నారు. సరిపల్లి తానేలు వద్ద రెండు తూరలు ఏర్పాటు చేయాలన్నారు. సార్వా పంట నష్టపోయున రైతులకు పరిహా రం అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ విష్టుచరణ్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-27T05:32:25+05:30 IST