శరణు మాత.. శరణు

ABN , First Publish Date - 2022-09-27T05:37:03+05:30 IST

జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమ య్యాయి.

శరణు మాత.. శరణు
మావుళ్లమ్మ

దసరా ఉత్సవాలు ప్రారంభం
భీమవరం టౌన్‌, సెప్టెంబరు 26 : జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమ య్యాయి. అమ్మవార్లకు ప్రత్యేక అలంకారం చేశారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భీమవరంలోని మావుళ్లమ్మకు తొలిరోజు స్వర్ణ కవచలాం కృత అలంకారం చేశారు. ఉదయం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మానేపల్లి నాగన్నబాబు దంపతులచే పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ చేయించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Read more