-
-
Home » Andhra Pradesh » West Godavari » westgodavari dail number 1930-NGTS-AndhraPradesh
-
1930
ABN , First Publish Date - 2022-09-10T06:29:50+05:30 IST
మోసపూరిత రుణయాప్‌ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లోన్‌యాప్స్ ప్రతినిధుల వేధింపులపై, సైబర్ నేరాలపై 1930 నెంబ ర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ సూచించారు.

రుణయాప్ వేధింపులపై ఈ నెంబరుకు కాల్ చేయండి : ఎస్పీ రవిప్రకాష్
భీమవరం క్రైం, సెప్టెంబరు 9 : మోసపూరిత రుణయాప్‌ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లోన్‌యాప్స్ ప్రతినిధుల వేధింపులపై, సైబర్ నేరాలపై 1930 నెంబ ర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ సూచించారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో లోన్‌యాప్ మోసాలపై ప్రచార పోస్టర్‌ను శుక్రవారం ఎస్పీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోన్‌యాప్స్ అనేక దారుణాలకు కారణమ వుతున్నాయన్నారు. రుణాలు ఇచ్చే యాప్‌ల ప్రతినిధులు ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడి, వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు. యువత, మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏఎస్పీ రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.