ప్రధాని పర్యటనకు పక్కా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-06-07T06:23:32+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ జూలై 4న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొనేం దుకు భీమవరం వస్తున్న సందర్భంగా అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదే శించారు.

ప్రధాని పర్యటనకు పక్కా ఏర్పాట్లు

 అధికారుల సమీక్షలో కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం/టౌన్‌, జూన్‌ 6 : ప్రధాని నరేంద్రమోదీ జూలై 4న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొనేం దుకు భీమవరం వస్తున్న సందర్భంగా అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదే శించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ‘సెక్యూరిటీ పగడ్బంధీగా ఉండాలి. ట్రాఫిక్‌  నియంత్రణపై ప్రణాళిక రూపొందించాలి. శానిటేషన్‌, డ్రెయినేజీ శుభ్రం చేయాలి. ఏంటి లార్వా ఆపరేషన్‌ చేపట్టాలి. దూరదర్శన్‌, ఆల్‌ ఇండియా రేడియో, ఇతర ప్రసార మాధ్యమాలలో లైవ్‌ టెలికాస్ట్‌ కు ఏర్పాట్లు చేయాలి. రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. అవసరమైన జనరేటర్లు సిద్ధం చేయాలి. డాక్టర్లు, అంబులెన్స్‌లు, మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటలో ఉంచాలి. ప్రధాని కాన్వాయ్‌కి, ఇతర అధికారులకు వాహనాలు ఏర్పాటు చేయాలి’ అని ఆదేశిం చారు. ఎస్పీ యు.రవిప్రకాష్‌, డీఆర్‌వో కృష్ణవేణి, ఏఎస్పీ రవికుమార్‌, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.


పనితీరుపై కలెక్టర్‌ అసంతృప్తి
జిల్లా విద్యా శాఖ, డీఎంహెచ్‌వో, ఐసీడీఎస్‌ శాఖ ప్రగతిపై కలెక్టర్‌ ప్రశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు శాఖల ప్రగతిపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌తో చర్చించారు. కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ వివిధ శాఖలకు ఇచ్చిన టార్గెట్‌ విషయం లో కచ్చితంగా పూర్తి చేయాలన్నారు. టార్గెట్స్‌  కాగితాల్లో చూపిం చటం కాదు. క్షేత్ర స్థాయిలో ప్రగతి కనిపించాలి కనపడాలన్నారు. అర్హులెవరూ పథకం అందలేదనే ఫిర్యాదు రాకూడదన్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటెషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఆర్వో కె.కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


చెప్పడం కాదు.. పరిష్కరించండి

స్పందనలో అందే వినతులపై పరిష్కార తీరు పిటీషనర్‌ సంతృప్తి చెందేలా ఉండాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందనలో ఆమె అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 110 అర్జీలు అందా యని వీటిని అధికారులు త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
ఎస్పీ స్పందనలో 11 ఫిర్యాదులు
ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందనలో 11 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఎక్కువగా ఆస్తి, కుటుంబ తగాదాలు ఉన్నాయి. వీటిని పరిశీలించి, పరిష్కరించాలని ఎస్పీ రవిప్రకాష్‌ ఆయా పోలీస్‌ స్టేషన్ల అధికారులకు ఆదేశించారు. ఆకివీడు కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు తన ఇంటి పక్కనే నివసిస్తున్న వ్యక్తులు తన ఇంటి ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకుని మొత్తం భూమి రాయాలని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసింది. భీమవరానికి చెందిన బార్‌ అసోసియేషన్‌ తరుపున న్యాయవాదులు ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి పెనుగొండ పోలీస్‌ స్టేషన్‌లో పెనుగొండ ఎస్‌ఐ, భీమవరం న్యాయవాదికి జరిగిన ఘర్షణపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు.

Read more