ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-11-17T00:03:32+05:30 IST

జిల్లాలో ప్రతీ ఒక్కరూ ఆధార్‌ కార్డును విధిగా అప్డేట్‌ చేసుకోవాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి సూచించారు.

ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి

18, 19 తేదీల్లో ప్రత్యేక ఆధార్‌ నమోదు క్యాంప్‌

అన్ని మిల్లుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి : కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం/పాలకొల్లు రూరల్‌, నవంబరు 16 : జిల్లాలో ప్రతీ ఒక్కరూ ఆధార్‌ కార్డును విధిగా అప్డేట్‌ చేసుకోవాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి సూచించారు. ఆధార్‌ కార్డు పొంది పదేళ్లు పూర్తయిన ప్రతీ ఒక్కరూ అడ్రస్‌ తదితర వివరాలు, పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ప్రత్యేక ఆధార్‌ నమోదు, అప్డేషన్‌ క్యాంప్‌ నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి బుధవారం మండల అధికారులతో నాడు–నేడు పనులు, ఆధార్‌ అప్డేషన్‌, ఏపీ సేవ సర్వీసులు, గృహ నిర్మాణం, జగనన్న స్పోర్ట్స్‌ క్లబ్‌లు, అమూ ల్‌ పాల కేంద్రాల ప్రారంభంపై సమీక్షించారు. ప్రతీ శనివారం గృహ నిర్మాణాలకు సంబంధించిన అధికారులతో చర్చించి ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. డీఈవో ఆర్‌వీ రమణ, సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్‌, డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాలరావు, డ్వామా పీడీ రాజేశ్వరరావు, డీఎల్‌డీవో కేసీహెచ్‌ అప్పారావు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని రైస్‌ మిల్లుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. తన కార్యాలయంలో బుధవారం రాత్రి ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 153 రైస్‌ మిల్లులో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, మిగిలిన రైస్‌ మిల్లుల్లోను వెంటనే ఏర్పాటు చేసి, వాటిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేసి ప్రతీరోజు డేటాను పరిశీలించేందుకు సమర్పించాలన్నారు. తొలి విడతలో 34 ఆర్బీకేల్లో పీపీసీ సెంటర్లును వినియోగంలోకి తీసుకురాగా, నేటికీ నాటి సంఖ్య 67గా ఉన్నాయన్నారు. జిల్లా కోపరేటివ్‌ అధికారి ఎం. రవికుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు, సివిల్‌ సప్లైస్‌ డీఎం టి.శివరాంప్రసాద్‌, డీఎస్‌వో ఎన్‌.సరోజ పాల్గొన్నారు.

మంచి భోజనం పెట్టాలి..

మన బడి నాడు–నేడు పనుల్లో నాణ్యతలో ఏ విధమైన రాజీ పడరాదని, విద్యార్థులు తృప్తి పడే విధంగా మధ్యాహ్నా భోజనం అం దజేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. పూలపల్లి జడ్పీ హైస్కూల్‌ ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి భోజన పఽథకం, నాడు – నేడు పనులు పరిశీలించారు. ఎస్‌ఎస్‌వై పీవో శ్యామ్‌సుందర్‌, తహసీ ల్దార్‌ జి.మమ్మి, కమిషనర్‌ ఎన్‌.ప్రమోద్‌ కుమార్‌, ఈవోపీఆర్డీ షరీఫ్‌, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - 2022-11-17T00:03:55+05:30 IST

Read more