నాపై ఈవ్‌ టీజింగ్‌ కేసా..?

ABN , First Publish Date - 2022-06-07T06:42:33+05:30 IST

‘ఇటీవల బి.సింగవరంలో నాపై ఈవ్‌టీజింగ్‌ కేసు పెట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా ? అయినా నాది ఈవ్‌ టీజింగ్‌ చేసే వయసా ? ఎవరైనా చెప్పండి’ అంటూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

నాపై ఈవ్‌ టీజింగ్‌ కేసా..?

 అది చేసే వయసేనా నాది ?  : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆశ్చర్యం
ఏలూరు రూరల్‌, జూన్‌ 6 : ‘ఇటీవల బి.సింగవరంలో నాపై ఈవ్‌టీజింగ్‌ కేసు పెట్టారు. ఇంతకంటే  దారుణం ఉంటుందా ? అయినా నాది ఈవ్‌ టీజింగ్‌ చేసే వయసా ? ఎవరైనా చెప్పండి’ అంటూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘నేను దేనికి భయపడేది లేదు. ఈ రోజు నేను పోతే, నా వెనుక ఉన్నవాడు వచ్చి పోరాడతాడు. రెండు రోజుల క్రితం ఓ అగంతకుడు ఫోన్‌ చేసి నన్ను చంపడా నికి షూటర్‌ను పురమాయించారని బెదిరించాడు. అగంతకుడి ఫోన్‌ నెంబర్‌, కాల్‌ రికార్డింగ్‌తో త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యా దు చేసినా ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదు’ అంటూ ఏలూరు స్పందనలో సోమవారం ఇన్‌ఛార్జి కలెక్టర్‌ అరుణ్‌బాబు కు ఫిర్యాదుచేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ‘నన్ను హత మార్చేందుకు కుట్ర జరుగుతోంది. వైసీపీ ప్రభు త్వం ఇప్పటికే నాపై 26 కేసులు నమోదు చేసింది. అందులో 14  ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించారు. సీఎం జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయిం చాలి. మంత్రులు జోగి రమేష్‌, కొట్టు సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డిలు నేనేమిటో తెలుసుకుని మాట్లాడాలి. దిశ డీఎస్పీ సత్యనారాయణ తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. 

Read more