అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు

ABN , First Publish Date - 2022-04-05T06:09:56+05:30 IST

తణుకు మునిసిపాలిటి కేంద్రంగా ఎమ్మె ల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రూ.390 కోట్ల టీడీఆర్‌ బాండ్ల స్కామ్‌ జరిగిందని మాజీ ఎమ్మెల్యే ఆరి మిల్లి రాధాకృష్ణ అన్నారు.

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తణుకు, ఏప్రిల్‌ 4 : తణుకు మునిసిపాలిటి కేంద్రంగా ఎమ్మె ల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రూ.390 కోట్ల టీడీఆర్‌ బాండ్ల స్కామ్‌ జరిగిందని మాజీ ఎమ్మెల్యే ఆరి మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుమ్మంపాడులో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కారుమూరి టీడీఆర్‌ స్కామ్‌లో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు. వాటికి సంబంధించిన వాస్తవాలను ఆధారాలను టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి సమాచార హక్కుచట్టం ద్వారా సేకరించి మీడియాకు తెలిపారన్నారు. టీడీఆర్‌ స్కామ్‌లో టీడీపీ వాళ్లు ఉన్నారని ఆరోపించడం కాకుండా  విచారణ చేపడితే దోషులు ఎవరో తెలుస్తుందన్నారు. చిత్తశుద్ధి ఉంటే మీరు విసిరిన సవాల్‌కు సిద్ధ మని, కారుమూరి అవినీతిని ప్రజలకు తెలిపి దోషులుగా నిలబెడతామన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ దొమ్మేటి సుధాకర్‌, నరసాపురం పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, మాజీ ఏయంసి ఛైర్మన్‌ తోట సూర్యనారాయణ, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ మంత్రిరావు వెంకటరత్నం, అత్తిలి మండల పార్టీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, తణుకు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతీరావు, తణుకు మండల అధ్యక్షులు పితాని మోహన్‌, మాజీ కౌన్సిలర్‌ గుమ్మళ్ళ హనుమంతు, రాష్ట్ర మహిళా కార్యదర్శి తమరపు రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-05T06:09:56+05:30 IST