తణుకులో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు

ABN , First Publish Date - 2022-03-16T19:53:48+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలో బుధవారం రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

తణుకులో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలో బుధవారం రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దువ్వ వద్ద జాతీయ రహదారిపై వాటర్ ట్యాంక్‌ను లారీ ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో డ్రైవర్‌ను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తేతలి వద్ద హైవేపై ఓ లారీ అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయి బోల్తా పడింది. కాగా డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 

Read more