నిధులను ఎందుకు ఖర్చు చేయలేదు?

ABN , First Publish Date - 2022-11-11T23:21:10+05:30 IST

జిల్లాలో ఆస్పత్రుల అభివృద్ధి కోసం మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో ఎందుకు ఖర్చు చేయలేకపోతున్నారని కలెక్టర్‌ పి.ప్రశాంతి సంబంధింత అధికారులను ప్రశ్నించారు.

నిధులను ఎందుకు ఖర్చు చేయలేదు?
మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటం వద్ద కలెక్టర్‌ నివాళులు

భీమవరం, నవంబరు 11 : జిల్లాలో ఆస్పత్రుల అభివృద్ధి కోసం మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో ఎందుకు ఖర్చు చేయలేకపోతున్నారని కలెక్టర్‌ పి.ప్రశాంతి సంబంధింత అధికారులను ప్రశ్నించారు. ఆస్పత్రుల అభివృద్ధి నిమిత్తం కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి అభివృద్ధి నిధులను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్యశాఖ అధికారులతో శుక్రవారం ఆస్పత్రుల అభివృద్ధి నిధుల వ్యయంపై కలెక్టర్‌ సమీక్షించారు. నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా గతంలో జిల్లాకు రూ.1.25 కోట్లు నిధులను మంజూరు చేయగా.. ఇంతవరకు కేవలం రూ.30.45 లక్షలు మాత్ర మే ఖర్చు కావడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి డిసెంబరు నాటికి అవసరమైన పనులకు కమిటీ ఆమోదంతో ఖర్చు చేయాలని ఆదేశించారు.

త్యాగధనులను స్ఫూర్తిగా తీసుకోవాలి

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, శ్రీకనకదాసు వంటి త్యాగధనుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని వారి జీవితంలోని మంచి విషయాలు తెలుసుకుని ఆచరణలో పెట్టాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్‌ లో వారిరువురి జయంతి సందర్భంగా శుక్రవారం చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

జిల్లా మహిళా సమాఖ్య తొలి సమావేశం

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడంతో పాటు, విద్యా, ఆరోగ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి కోరారు. కలెక్టరేట్‌లో డీఆర్‌డీఏ కార్యాలయంలో శుక్రవారం జిల్లా మహిళా సమాఖ్య తొలి సమావేశం జరిగింది.

సమన్వయంతో పని చేయండి..

అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాల సాధనతో జిల్లాను అభివృద్ధిలోకి తీసుకురావాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి గడపగడపకు మన ప్రభుత్వం, గృహనిర్మాణాలు, నాడు–నేడు పాఠశాలలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, జగనన్న స్పోర్ట్స్‌ క్లబ్‌, ఆయుష్‌ భారత్‌ యోజన, ఈకేవైసీ, అమూల్‌, అనీమియా సర్వే, స్పందన గ్రీవెన్స్‌ తదితర అంశాలపై సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులతో శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-11-11T23:21:10+05:30 IST

Read more