ఎడతెరిపివ్వని వాన

ABN , First Publish Date - 2022-09-09T05:19:54+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షాలు కురిశాయి.

ఎడతెరిపివ్వని వాన
తాడేపల్లిగూడెంలో వర్షంలో తడుస్తూ వెళ్తున్న వాహనదారులు

జన జీవనానికి ఇబ్బందులు.. రోడ్లు ఛిద్రం
తాడేపల్లిగూడెం రూరల్‌/ భీమవరం టౌన్‌, సెప్టెంబరు 8 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో  జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షాలు  కురిశాయి.  జన జీవనానికి ఇబ్బందులు కలిగాయి. బుధవారం సాయంత్రం నుంచి ప్రారంభ మైన వర్షం తెల్లవారు జామున కొంత తెరుపు ఇచ్చింది. గురు వారం ఉదయం 9గంటల వరకు వాతావరణం పొడిగా మారిన ఆపై మరల వర్షం కురిసింది. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవ రం, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం ప డింది. వర్షంతో రోడ్లు ఛిద్రంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన అన్నదానాలకు ఆటంకం ఏర్పడింది.  జిల్లాలో బుధవారం ఉదయం 8–30 నుంచి గురు వారం ఉదయం 8–30 వరకు జిల్లాలో 306.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా తణుకులో 29.4 మి.మీ, అత్యల్పంగా కాళ్ళలో 7 మి.మీ నమోదైంది. భీమవరం 9.4 మి.మీ, వీరవాసరం 11.2, తాడేపల్లి గూడెం 20, పెంటపాడు 13.8 అత్తిలి 25.2, ఆకివీడు 8.2, ఉండి 8.6, పాల కోడేరు 12.8, పెనుమంట్ర 10.4, ఆచంట 17, పెనుగొండ 14.2, ఇరగవరం 17.4, పోడూరు 20.2, మొగల్తూరు19.4, నరసా పురం 13, పాలకొల్లు 26.4, యలమంచిలిలో 23.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.


Read more