దళిత కుటుంబాల.. దాహం కేకలు..

ABN , First Publish Date - 2022-02-17T05:25:04+05:30 IST

చిన్న సమస్య కారణంగా ఆరు నెలలుగా 22 కుటుంబాలకు నీరం దడంలేదు..

దళిత కుటుంబాల.. దాహం కేకలు..
పైప్‌లైన్‌ తొలగించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కోమటితిప్ప గ్రామస్థులు

కోమటితిప్పలో 22 కుటుంబాలకు అందని నీళ్లు


మొగల్తూరు, ఫిబ్రవరి 16 : చిన్న సమస్య కారణంగా ఆరు నెలలుగా 22 కుటుంబాలకు నీరం దడంలేదు.. అధికారులు తలచుకుంటే చిటికెలో పరిష్కరించవచ్చు.. అయినా కదలిక లేదు.. ఆ 22 కుటుంబాలు మాత్రం తాగునీరందక లబోదిబోమంటున్నారు. కోమటి తిప్ప, కోమటితిప్ప నార్త్‌ పక్క పక్క గ్రామాలు.. కోమటితిప్ప నార్త్‌ గ్రామంలో గత ఆగస్టులో రహదారి నిర్మాణం చేపట్టారు. అప్పటిలో  కోమటితిప్పలో దళితవాడకు నీరందించే పైప్‌లైన్‌ను తొలగించారు.ఆ పైప్‌లైన్‌ తొలగింపుతో గడచిన ఆగస్టు నెల నుంచి 22 దళిత కుటుంబాలకు తాగునీరందడం ఆగిపోయింది. తమ సమస్యను మండల స్ధాయి అధికారులు, ఎంపీపీ, జడ్పీటీసీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోలేదు. దీనిపై  కోమటి తిప్ప సర్పంచ్‌ పులపర్తి సూర్యనారాయణ (ఏసులు) మాట్లాడుతూ గ్రామంలో రహదారి నిర్మాణం, గ్రామాల మధ్య సరిహద్దు వివాదాల నేపద్యంలో 22 కుటుంబాలకు తాగునీరందడం లేదన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Read more